MLC Kavitha : మహిళలను మోసం చేసిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ
- మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేశాను
- క్రైస్తవ సోదరులకు బీఆర్ఎస్ పార్టీకి పేగు సంబంధం ఉంది
- తెలంగాణ పోరాటంలో ప్రతి ఒక్క చర్చిలో ప్రార్థనలు జరిగాయి : ఎమ్మెల్సీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : మెదక్ చర్చిలో ఎమ్మెల్సీ కవిత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేశానని, క్రైస్తవ సోదరులకు బీఆర్ఎస్ పార్టీకి పేగు సంబంధం ఉందన్నారు కవిత. తెలంగాణ పోరాటంలో ప్రతి ఒక్క చర్చిలో ప్రార్థనలు జరిగాయని, మెదక్ జిల్లా కల సాకారం అయిందంటే కారణం కేసీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు మెదక్‌కి వచ్చాయని, అమ్మగారి ఊరు కాబట్టి మెదక్ కి రావాలని ఉంటుందన్నారు కవిత. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గోదావరి జలాలతో సింగూరు నింపి మెదక్ జిల్లాకి నీళ్లు తెచ్చారని, కాళేశ్వరం పనులు మెదక్ జిల్లాలో సగంలోనే నిలిచిపోయాయన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్యాకేజీ 19 కింద జిల్లాలో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, కేసీఆర్ పై కోపంతో పనులు ఆపేయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. ప్రభుత్వాలు మారినా పనులు ఆపడం సరైనది కాదని ఆమె వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కాలువ పనులను అపొద్దని మేము కోరుతున్నామని, సీఎం జిల్లాకి వస్తున్నారంటే ఆడబిడ్డగా మాకేమైన వరాలు ఇస్తాడేమో అనుకున్నామన్నారు. నెలకు 2500, తులం బంగారం ఇస్తాడేమో అని మహిళలు అనుకున్నారు..కానీ ఏమీ లేదని ఆమె అన్నారు. పింఛన్ 4 వేలు ఇస్తామన్నారు.. ప్రతి 18 ఏళ్ల ఆడపిల్లకు స్కూటీ ఇస్తామన్నారు.. మహిళలను మోసం చేసిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ అని కవిత ఆరోపించారు. కేసీఆర్ కిట్లు అడబిడ్డలకు ఇస్తలేరని ఆమె మండిపడ్డారు.
Also Read
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
అంతేకాకుండా..’కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 40 శాతం నేరాలు పెరిగాయి.. కిడ్నాప్ కేసులు ఎక్కువయ్యాయి.. మహిళల భద్రతపై సీఎంకి సోయి లేదు.. రైతులకు రైతు బంధు లేదు.. సంక్రాంతికి ఇస్తామన్న రైతు బంధు కచ్చితంగా ఇవ్వాలి.. చిన్న స్థాయి ఉద్యోగులకు రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. అన్ని రకాల వరికి బోనస్ ఇస్తామని సన్న వడ్లకే అని మాట మార్చారు.. మొక్కజొన్న, సొయా, పత్తి, మిర్చి, పసుపు, చెరుకు, జొన్న రైతులకు మద్దతు ధర ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.. మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏమి చేయలేదు.. కొత్త ప్రభుత్వంపై ఏడాది వరకు విమర్శలు చేయొద్దని మా నాయకుడు కేసీఆర్ చెప్పారు.. అందుకే ఏడాది ఆగినం..ఏడాది అయ్యాక ప్రశ్నిస్తున్నాం.. రేషన్ కార్డుల ఊసే లేదు.. ఆనాడు మాటల కోటలు దాటి ఈ రోజు అన్ని కోతలే పెడుతున్నారు.. మెదక్ కి వచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి.. మహిళలకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి’ అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.
Venu Swamy : అల్లు అర్జున్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్‌వర్క్.. కేన్స్‌లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!