MLC Kavitha : తొలి మహిళగా రికార్డ్ సృష్టించిన ఎమ్మెల్సీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్-నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. ఆమె ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కవిత 2015 నుంచి తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా.. సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల కాలానికి 2015లో తొలిసారిగా ఈ పదవికి ఎన్నికైన కవిత, దేశంలోనే సంస్థ రాష్ట్ర విభాగానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులను కలుపుకుని మరింత కృషి చేస్తానని, రానున్న రోజుల్లో సంస్థ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు.
Also Read : Heavy Rains : న్యూజిలాండ్‌ను ముంచెత్తిన వర్షాలు.. విమాన సర్వీసులు రద్దు
Also Read
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే..?
బాల బాలికలలో దేశభక్తిని, క్రమశిక్షణను పెంపొందించి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి ప్రారంభించబడిన ఉద్యమం బాలభట ఉద్యమం (Scouts and Guides Movement). ఈ ఉద్యమంలో బాలుర బృందాలను “స్కౌట్స్”, బాలికల బృందాలను “గైడ్స్” అని అంటారు.
ఈ ఉద్యమాన్ని సర్ రాబర్ట్ బెడన్ పవల్ 1907 సంవత్సరం దక్షిణాఫ్రికా లో జరిగిన బోయర్ యుద్ధాలలో గాయపడిన వారికి సేవచేయడానికి ప్రారంభించాడు. అయితే పిల్లలలోని సహనం, స్నేహశీలత, ఉత్సాహం, పట్టుదలలను చూచిన పవల్ ఈ ఉద్యమాన్ని యుద్ధాల తర్వాత కూడా కొనసాగించాడు.
Also Read : NABARD Chairman: వ్యవసాయంతో పాటు మత్స్య, సహకార రంగాలకు రుణాలు
ఉద్యమంలో చేరిన పిల్లలకు సేవా పద్ధతులను అనుసరించి శిక్షణ (Training) ఇస్తారు. వీరికి ఈతకొట్టడం, వంతెనలు, రోడ్ల నిర్మాణం, ప్రథమ చికిత్స పద్ధతులను నేర్పుతారు. ఆయుధాలు లేకుండా వీరు కేవలం ఒక కర్రను మాత్రమే ధరిస్తారు. వీరికి సైనికుల వలె ప్రత్యేక దుస్తులు మెడలో ఒక స్కార్ఫ్ ఉంటుంది. ఈ ఉద్యమంలో చేరినవారు దళాలుగా ఏర్పడతారు. ప్రతి దళానికి ఒక పతాకం, వాయిద్యాలు ఉంటాయి. “సదా సమాజసేవలో ఉంటాం” అనే నినాదం ఈ పతాకం పై రాసి ఉంటుంది. ప్రతి జట్టు ఒక నాయకుడి ఆధీనంలో ఉంటుంది. ఈ ఉద్యమంలో విద్యార్ధులందరూ స్వచ్ఛందంగా చేరాలి. సత్యం పలకడం, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం, రోగగ్రస్తులకు సేవచేయడం, పోలీసు వ్యవస్థకు అత్యవసర సమయాల్లో సాయపడటం ద్వారా బాలభటులు సమాజసేవ చేయవచ్చును.
తాజావార్తలు
-
Trap: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల
-
Cult Trailer: ఈ రక్తపాతానికి అడ్డు అదుపు లేదా ‘విశ్వక్’?
-
Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
-
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
-
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!