Heavy Rains : న్యూజిలాండ్‌లో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇప్పటికే ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. పలువురు గల్లంతయ్యారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా రాజధాని ఆక్లాండ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల వీధులు తటాకాల్లా మారిపోయాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు, వస్తు సామాగ్రి నీళ్లలో కొట్టుకుపోవడం, మునిగిపోవడం కనిపించింది. న్యూజిలాండ్‌లోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్ ఉరుములతో కూడిన భారీ వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్నది. శుక్రవారం 240 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది మొత్తం వేసవిలో కురిసిన వర్షానికి సమానం. వరదల కారణంగా టెర్మినల్స్, రోడ్లు దెబ్బతిన్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
Read Also: Tik Tok Ban: టిక్ టాక్ బ్యాన్.. బిల్లు ప్రవేశపెట్టనున్న యూఎస్ గవర్నమెంట్
ట్విటర్‌లో షేర్ చేసిన టెర్మినల్స్‌లోని ఫోటోలు, వీడియోలు ప్రమాద స్థాయిని చూపిస్తున్నాయి. వరదల కారణంగా వేలాది మంది రాత్రిపూట టెర్మినల్స్‌లో విడిది చేశారని అధికారులు తెలిపారు. వాతావరణం గురించి 400 కంటే ఎక్కువ ఎమర్జెన్సీ కాల్స్ కు తాము ఎప్పటికప్పుడు సమాధానం అందించామని అధికారులు పేర్కొన్నారు. ఆక్లాండ్ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆక్లాండ్ విమానాశ్రయం అంతర్జాతీయ టెర్మినల్‌కు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆక్లాండ్ మేయర్, విపత్తు నిర్వహణ అధికారులతో కలిసి ప్రెస్‌తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వీలైనంత సహాయాన్ని అందిస్తుందని హిప్కిన్స్ చెప్పినట్లు ప్రకటించారు. వర్ష ప్రభావిత కమ్యూనిటీల కోసం ప్రభుత్వం ఇప్పటికే 64,900డాలర్ల పరిహారం అందుబాటులో ఉంచిందని ప్రధాని తెలిపారు.