వ్యవసాయంతో పాటు మత్స్య, సహకార రంగాలకు రుణాలు ఇవ్వాలన్నారు నాబార్డ్ ఛైర్మన్ కె.వి.షాజీ. ఆప్కాబ్ ఆధ్వర్యంలో బ్యాంకర్స్ కాంక్లేవ్ విజయవాడలో జరిగింది. మచిలీపట్నం డీసీసీబీ పదివేల కోట్ల వ్యాపారం చేస్తోంది. నాబార్డ్ ఒక జాతీయ స్ధాయి బ్యాంక్. క్రెడిట్, డిపాజిట్ నిష్పత్తిలో 144శాతం అంటే చాలా అద్భుతం. పల్నాడులో 240శాతం క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి ఉండటం గుర్తించాం. తిరుపతిలో క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి 75శాతం. రుణాలను మరింతగా పెంచగలిగితే క్రెడిట్, జీడీపీ నిష్పత్తి 80శాతం అయ్యే అవకాశం ఉంది. ఏపీ జీడీపీలో వ్యవసాయం మూడవ వంతు ఉంది. భారత ప్రభుత్వం వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖలలో పలు పథకాలు ఇస్తోందన్నారు.
వ్యవసాయంతో పాటు మత్య, సహకార రంగాలలో రుణాలు ఇవ్వాలి. నాబార్డ్ చట్టం మార్పు చేసిన తర్వాత ఎం.ఎస్.ఎం.ఈ లో కూడా పెట్టుబడి పెట్టాం అన్నారు. వ్యవసాయంలో కూడా వినూత్న క్రెడిట్ విధానాలు రావాలి. ఆర్.ఆర్.బి ల స్ధూల ఆదాయం 22 వేల బ్రాంచిల నుంచీ వస్తోంది. రైతులకు సైతం త్వరితగతిన రుణాలు అందించాలి. గ్రామీణ బ్యాంకులు చాలా ఉపయోగకరమైనవిగా బ్యాంకింగ్ పరిశ్రమ గుర్తించాలి. కె.సి.సి, ప్యాక్స్ లాంటి టెక్నాలజీలు ప్రస్తుతం రివ్యూ లో ఉన్నాయన్నారు నాబార్డ్ ఛైర్మన్ కేవీ షాజీ.
MP Avinash Reddy: అవినాష్ కు పార్టీ అండగా ఉంటుంది
సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీచి చౌదరి మాట్లాడుతూ.. దేశంలోనే అతి పెద్ద కోస్తా తీరం కలిగిన రెండవ రాష్ట్రం ఏపీ అన్నారు. ఏపిలో స్ధిరమైన ప్రభుత్వం, బాధ్యతాయుతమైన అధికార యంత్రాంగం ఉంది. ఏపీలో చిత్తూరు జిల్లా పుడ్ ప్రాసెసింగ్ హబ్ గా ఉంది. దేశంలోనే ఫుడ్ ప్రసెసింగ్ రంగంలో మొదటి స్ధానం చేరుకోవడానికి ఏపీకి అవకాశాలు ఉన్నాయి. వృద్ది రేటులో ఏపీ గణనీయమైన ప్రగతి సాధించింది. వ్యవసాయ సహకార పరపతి సంఘాలకి తగిన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు ఉమ్మడి లక్ష్యం కోసం పని చేయడం ద్వారా సామాన్యులకి మేలు చేయాలన్నారు చిరంజీవి చౌదరి.
Read Also: Nandamuri Tarakaratna: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. వైద్యులు ఏమన్నారంటే..?