హజురాబాద్‌లో రాజీకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధ కొనసాగుతోంది. అయితే.. తాజాగా కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి ఉంటే మళ్ళీ నేను హుజూరాబాద్ లో గెలవను అని ఈటల అనుకుంటున్నాడని, ఈటలను ఓడగొట్టడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈటలపై నేను ఎమ్యెల్యే గా గెలిచినప్పుడే నాకు తృప్తి అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవిర్భావ వేడుకల్లో మేము విద్యా దినోత్సవం రోజు ర్యాలీ తీస్తుంటే ట్రాక్టర్ కింద పడి స్టూడెంట్ చనిపోయాడని ఈటల ఆరోపిస్తున్నారని, అసలు బాధిత అబ్బాయికి స్కూల్ లో అడ్మిషన్ లేదు.. ర్యాలీలో పాల్గొనలేదన్నారు. పక్క నుంచి నడుచుకుంటు వెళ్తుంటే కుక్కలు వెంటపడ్డాయి.. ప్రమాదవశాత్తు జరిగిందని ఆయన అన్నారు. ఈటల రాజేంద్ర గుర్తుంచుకో.. వంద కభేళాలను తిన్న రాబందు చిన్న గాలివానకు కొట్టుకుపోయినట్టు.. నీ దృష్టిలో నేను చిన్న గాలివాననే కావచ్చు.! కానీ నిన్ను రాజకీయంగా కూల్చేది నేనే అంటూ ఆయన సవాల్ విసిరారు.
Also Read : Uddhav Thackeray: పరువు నష్టం కేసులో ఉద్ధవ్ ఠాక్రేకు కోర్టు సమన్లు జారీ
నేను షాప్స్ లో, ఇసుక ట్రాక్టర్లు దగ్గర పైసల్ అడుగుతున్నానని ఈటల అనడంపై హుజురాబాద్ నడిబొడ్డున చర్చకు ఈటల సిద్ధమా.? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ‘ఒకప్పుడు నీకు ఉండనికి ఇళ్లే సక్కగా లేకుండే.. ఈరోజు ఐదు ఎకరాల్లో వందకోట్లతో గడి ఎట్లా కట్టినవ్.? కోళ్ల ఫామ్ పెట్టుకున్నోళ్ళు అందరు నీలెక్క ఎట్లా ఐతలేరు చెప్ప రాజేంద్ర.? నీ కోళ్లు బంగారు గుడ్లు పెడుతున్నాయా.? నీ దగ్గర ఉన్న కార్ల విలువనే పదిహేను కోట్లు.. ఇంత డబ్బు ఎక్కడనుంచి వచ్చింది.? ఈరోజు నుంచి నీ పేరు ఈటల రాజేందర్ కాదు.. చీటర్ రాజేందర్.. నిన్ను కేసీఆర్ ఇంత పెద్దగా చేస్తే.. వారి కుటుంబం గురించి ఎలా మాట్లాడుతున్నాడు.. అన్నం పెట్టేటోడికి సున్నం పెట్టె రకం ఈటల రాజేంద్ర.. నువ్వు ఎమ్యెల్యేవు.. నేను ఎమ్యెల్సీ ని ప్రభుత్వ విప్ ని.. నేను నీ కంటే ఒక మెట్టెక్కువ.. ఏడేళ్లు మంత్రిగా ఉండి హుజురాబాద్ కు ఎంత చేశావో ప్రజలకు తెలుసు.. హుజురాబాద్ లో ఈసారి ఈటెల ఓడిపోతున్నాడు..
Also Read : WeWantJusticeForShyamNTR: శ్యామ్ మృతిపై స్పందించిన పోలీసులు.. ఏమన్నారంటే..?
అసలు ఈటల ఏ పార్టీలో ఉన్నాడు.? బీజేపీలో అంటవు.. కాంగ్రెస్ అంటవు మళ్ళీ బీఆర్ఎస్ అంటవు.. నిన్ను ఇంటికి పంపడానికి హుజురాబాద్ ప్రజలు ఇంటికి పంపడానికి రెడీ అయ్యారు.. తెలంగాణ ముదిరాజ్ అన్నదమ్ములు.. అక్కాచెల్లెళ్లు ఆలోచించాలి.. దండం పెడుతున్నా.. బీసీ కులాలందరు ఆలోచించాలి.. మీకు విజ్ఞప్తి చేస్తున్న.. హుజురాబాద్ ప్రజలు అందరూ ఆలోచించాలి.. మిమ్మల్ని ఈటల ఎంత చిన్న చూపుతో చూస్తున్నారో ఆలోచించండి.’ అని ఆయన అన్నారు.