తెలంగాణలోని మందు బాబులకు బ్యాడ్ న్యూస్. 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి 27వ తారీకు సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు. మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ కానున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలోని సగానికి పైగా జిల్లాల్లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
Also Read: Dr K Laxman: 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు.. ఎంపీ లక్ష్మణ్ సెటైర్లు!
ఈ నెల 27న వరంగల్ -ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అలానే మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేయనున్నాట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పట్టభద్రుల స్థానంలో 56, టీచర్ల స్థానంలో 15 మంది పోటీలో ఉన్నారు.