Balmuri Venkat: కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైంది..
- కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారు- బల్మూరి వెంకట్
- సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్ కు ఊరట లభించలేదు
- కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు- వెంకట్
- కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైంది- బల్మూరి వెంకట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారని ఆరోపించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్‌కు ఊరట లభించలేదు.. అందుకే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కేటీఆర్‌ను దుయ్యబట్టారు. కేటీఆర్‌కు హైదరాబాద్ పై ఒక స్పష్టత లేదు.. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో బావ, బామ్మర్ది ఎన్నో స్కామ్‌లకు పాల్పడ్డారని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో అడ్డమైన జీవోలు ఇచ్చి ప్రభుత్వ భూములను ప్రైవేటు రంగానికి, బిల్డర్లకు ఇచ్చి డబ్బులు దోచుకు తిన్నారని పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu Serious: తిరుపతి ఘటనపై సీఎం సీరియస్.. వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
కేటీఆర్ చేసిన అక్రమాలకు ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని బల్మూరి వెంకట్ తెలిపారు. కరీంనగర్ అక్రమ ఇసుక రవాణా చేసింది మీ తమ్ముడు, మీ బాబాయ్ కాదా.. అని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో చెల్లె కవిత ఇరుక్కుని ఊసలు లెక్క పెట్టింది నిజం కాదా అని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో అదానీతో కేసీఆర్ చేసుకున్న అక్రమ ఎలక్ట్రిసిటీ ఒప్పందాల సంగతేంటని అన్నారు. ఫోన్ టాపింగ్ విషయంలో ఆర్థిక, రాజకీయ అంశాలను చేర్చి దోపిడీకి తెరలేపింది కేటీఆర్ అని బల్మూరి వెంకట్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Sankranti ki vastunnam : సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని బల్మూరి వెంకట్ అన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని.. ఒక బోగస్ ప్రచారానికి కేటీఆర్ తెరలేపాడని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో కేటీఆర్ చేసిన అవినీతి చిట్టాను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకువచ్చిన స్కామ్‌కు దారి తీసింది.. ఏసీబీకి పూర్తిస్థాయిలో సహకరించి నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. దోపిడీకి పాల్పడిన కేటీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదని బల్మూరి వెంకట్ తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!