Sankranti ki vastunnam : సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్. పెద్ద సినిమాలు విడుదల అయ్యేటప్పుడు ప్రభుత్వం సినిమా టిక్కెట్ల పెంపునకు అనుమతి మంజూరు చేయాలంటూ నిర్మాతలు విన్న వించుకోవడం పరిపాటి. ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చిత్ర బృందానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also:Hyderabad: జీహెచ్ఎంసీ ఆఫీసులో కాంట్రాక్టర్ల నిరసన.. కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం..!
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల రోజు నుంచి మొదటి పది రోజులు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, ముల్టీప్లెక్స్‌లో రూ. 125 పెంచుతూ అనుమతులు ఇచ్చింది. ఈ పెంపుతో సంక్రాంతికి వస్తున్నాం టక్కెట్ ధరలు రూ. 245, రూ. 175 రూ. 302గా ఉండనున్నాయి. యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గోదారి గట్టు మీద రామచిలకవే మీను సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచాయి.
Read Also:Biggest Stampedes: దేశంలో జరిగిన అతి పెద్ద తొక్కిసలాట ఘటనలు ఇవే.. వందలాది మరణాలు!
ఈ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకూ మహారాజ్ సినిమా ఈ నెల 12 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. 12న ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షోకు అనుమతిచ్చింది ఏపీ ప్రభుత్వం. దీనిక టిక్కెట్ రూ.500లకు పెంచుకోవచ్చని ప్రకటించింది. అలాగే మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అంతేకాకుండా.. రోజుకు 5 షోలు వేసుకునేందుకు వీలు కల్పించారు.