MLA Raja singh: బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్య అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ నినాదం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా లేదా ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా, భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారు. తెలంగాణలో చిన్న ఎన్నికల గాని పెద్ద ఎన్నికల గాని వస్తే బీసీలనే మర్చిపోతారన్నారు. ఇవాళ బీసీలు మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ లోపల ఎక్కడున్నారో కొద్ది చెప్తారా కిషన్ రెడ్డి అని ప్రశ్నించారు. తాను ఇంతకు ముందు ఎప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదని.. హిందూత్వం గురించి మాత్రమే మాట్లాడుతానన్నారు. కానీ ఈ రోజు దాని గురించి మాట్లాడటానికి కారణం.. మీరు ప్రతి ఎన్నికల్లో బీసీ కార్డును ప్లే చేసి, బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారని చెప్పారు. బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసినందుకు లంకల దీపక్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
READ MORE: Supreme Court: ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు శుభవార్త.. గ్రీన్ క్రాకర్ల వాడకానికి అనుమతి
ఇదిలా ఉండగా… జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. లంకల దీపక్‌రెడ్డి పేరు ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2023 ఎన్నికల్లోనూ దీపక్‌రెడ్డి జూబ్లీహిల్స్ భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.