Naari Naari Naduma Murari : ఓటీటీలోకి వచ్చేసిన శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు రామ్ అబ్బరాజు కాండినేషన్‌లో వచ్చిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఒక యువకుడి కథను దర్శకుడు చాలా సరదాగా తెరకెక్కించారు. ముఖ్యంగా శర్వానంద్ టైమింగ్, కామెడీ సీన్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంయుక్త, సాక్షి తమ నటనతో ఆకట్టుకోగా.. నరేష్ వంటి సీనియర్ నటులు తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే పాపులర్ అవ్వగా, సినిమా విజువల్స్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. అనిల్ సుంకర నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించేసింది.
Also Read : ‘Michael’ Trailer Out: మళ్లీ తిరిగొచ్చిన ‘కింగ్ ఆఫ్ పాప్’.. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ట్రైలర్ అదుర్స్!
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 3వ తేదీ అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని హాయిగా ఈ వినోదాన్ని ఆస్వాదించవచ్చు. ఒక మంచి వీకెండ్ వాచ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. థియెటర్ లో సైలెంట్ గా వచ్చి మంచి హిట్ అందుకున్నా ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. మీరు ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారైతే వెంటనే వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసేసుకోండి!
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?