Tatikonda Rajaiah: సొమ్మొకడిది.. సోకొకడిది.. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార బీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గాల మధ్య రాజకీయ రణరంగం కొనసాగుతుంది. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఏర్పడింది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రానున్న ఎన్నికల కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. దీంతో తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో మాటల బాణాలు వదులుతున్నారు. నిత్యం ఏదో విధంగా కడియంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
Jasprit Bumrah: టీమిండియాకు భారీ షాక్.. జస్ప్రీత్ బుమ్రా ఔట్!
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
తాజాగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్‌లో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్నట్లుగా పరిస్ధితి మారిందని విమర్శలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో అందరికీ తెలుసునని.. మేం చేసిన పనులను తామే చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్ధితి నెలకొందని మండిపడ్డారు. ఎక్కడో వుండి ఇక్కడ పనులు చేశామని చెప్పుకోవడం సరైంది కాదన్నారు తాటికొండ రాజయ్య. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి విద్య ద్వారానే ఈ స్థాయికి వచ్చానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Big Breaking: ఈటల రాజేందర్‌కు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లోని ముందు వాహనాన్ని ఢీకొన్న కారు
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించారు. కాగా.. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ గా ఉన్న రాజయ్యను కాదని కడియం శ్రీహరికి అవకాశం కల్పించింది బీఆర్ఎస్ అధిష్టానం. దీన్ని రాజయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నవ్య మరోసారి తెరపైకి వచ్చారు. తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని.. ఒక మహిళ ఎమ్మెల్యే అయితే ఆడపడుచులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలు కలుగుతుందని నవ్య చెప్పారు. మాదిగ బిడ్డనైన తనకు స్టేషన్ ఘన్పూర్ నుంచి అవకాశం కల్పించాలని ఆమె కోరారు. కేసీఆర్ ఒక్క ఛాన్స్ ఇస్తే నియోజకవర్గం రూపు రేఖలు మారుస్తానని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!