Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- ఎన్నికల సంఘం, SIR మద్దతుగా 124 మంది మాజీ IAS, IFS అధికారుల బహిరంగ లేఖ..
- ఆధారాలు లేకుండా ‘‘ఓట్ చోరీ’’ ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanesh Kumar: భారత ఎన్నికల సంఘం (ECI), ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), జ్ఞానేశ్ కుమార్‌లకు భారీ మద్దతు లభించింది. ఈసీకి మద్దతు తెలుపుతూ 124 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించే వారు అందుకు విశ్వసనీయ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఎన్నికల వ్యవస్థపై అక్రమ ఆరోపణలు చేస్తూ, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని హెచ్చరించారు. ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని, ఎస్ఐఆర్ను సమర్థి్స్తూ 42 మంది మాజీ న్యాయమూర్తులు మద్దతు తెలిపారు.
లేఖలో భారత ప్రజలను ఉద్దేశించి ఈ లేఖను రాశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ‘ఓట్ చోరీ’కి పాల్పడ్డారని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలు ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సమయంలో మాజీ బ్యూరోక్రాట్లు ఈ లేఖను విడుదల చేయడం సంచలనంగా మారింది.
Also Read
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీ, ఈవీఎం మిషన్లను భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌ల పర్యవేక్షణ వంటి బాధ్యతల్ని నిర్వహించిన అనుభవం తమకు ఉందని మాజీ అధికారులు లేఖలో పేర్కొన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి చెందినవాళ్లం కాదని, ఆధారాలు లేకుండా మన ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని పదే పదే ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ సారి ఓట్ చోరీ అనే పదాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
గతంలో ఎన్నికల్లో అక్రమాలు ఎలా జరిగేవో తమకు తెలుసని, పోలింగ్ కేంద్రాల వద్ద తుపాలకులతో బెదిరింపులు, ప్రభావవంతమైన వ్యక్తుల అనుచరుల దాడులు, బ్యాలెట్ పెట్టెల్లో అక్రమంగా ఓట్లు వేయడం, ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలు అప్పట్లో చోటుచేసుకునేవని తెలిపారు. బూత్ క్యాప్చరింగ్ విస్తృతంగా ఉండటంతో 1989లో పార్లమెంట్ దానిని నేరంగా పరిగణిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుందని లేఖలో గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా అవసరమని చెప్పారు.
తాజావార్తలు
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!