Kunamneni Sambasiva Rao: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం.. మద్దతుపై చర్చిస్తున్నాం!
- బలంగా ఉన్న చోట పోటీ చేస్తాం
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తాం
- ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోట పోటీ చేస్తాం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే ముందుకూ వెళ్తామని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం అని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్ధుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేయడాన్ని తాను స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి పోకడకు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులను ఎన్ కౌంటర్ పేరుతో చంపేస్తున్నారని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కూనంనేని కోరారు.
‘కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను కలుపుకోవడంలో వైఫల్యం చెందింది. సమన్వయం చేసుకోవడంలో విఫలమైంది. కమ్యూనిస్టు పార్టీల కలయికతోనే గెలిచిందని మర్చిపోతున్నారు. దేశవ్యాప్తంగా అనేక పరిణామాలు చూస్తున్నారు కానీ.. కలుపుకోవడం తెలియడం లేదు. మావోయిస్టులను అంతం చేసేందుకు మార్చి నెలలో ముహూర్తం పెట్టారు. ముహూర్తాలు ఎవరు పెడతారు.. ఎందుకు పెడుతారు?. రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా మావోయిస్టులను మట్టుపెట్టడానికి ముహూర్తాలు పెట్టడం ఏమిటి?. మావోయిస్టులు సంఘవిద్రోహ కార్యక్రమాలు చేస్తున్నారు.. సంఘవిద్రోహులేమో అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉంటారు. ప్రజలకోసం పనిచేసే మావోయిస్టులను చంపేస్తారా?. అమిత్ షా హత్యలు చేస్తున్నట్టే.. అతనిపై విచారణ చెయ్యాలి’ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు పేర్కొన్నారు.
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
‘ కులగణన అధికారంగా ప్రకటించారు, అందుకు సంతోషం. దానిని మేము అంగీకరించాం. బీసీలు తగ్గారు అంటున్నారు.. గ్రామ సభల్లో పెట్టాలి ఈ అంశాన్ని. ఎస్సీ కులగణనలో చిన్న చిన్న లోపాలున్నాయి, వాటిని రీ వెరిఫై చెయ్యాలి. ఆర్టీసీ కార్మికులు సమ్మె దిశగా ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు బలం ఉన్నచోట పోటీ చేస్తాం. కుదిరిన చోట కాంగ్రెస్ పార్టీతో కలుపుకుపోతం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం. టీచర్ ఎమ్మెల్సీలకు ఇంకా చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చేసినవి చెప్పుకోవడం చేత కావడం లేదు. 22 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినా కూడా చెప్పుకోవడం లేదు. రైతు భరోసా వేస్తున్నారు. మోడల్ విలేజీస్లో ఇల్లు కట్టిస్తున్నారు. రుణమాఫీ 2 లక్షల విషయంలో కొంత వైఫల్యం చెందారు. కొన్ని అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంది. కానీ చేసినవి చెప్పుకోవడంలో ఫెయిల్ అయింది. ప్రభుత్వంలో ఎవ్వరు ఫోన్ కాల్స్ అటెండ్ చెయ్యడం లేదు. ప్రభుత్వం దీన్ని గమనించాలి’ అని ఎమ్మెల్యే కూనంనేని సూచించారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!