MLA Gadari Kishore Kumar Fired on BJP Leaders
తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే మునుగోడులో ఉప ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఆ నియోజకవర్గం చుట్టూ పాదయాత్రలు, బహిరంగ సభలు పెట్టి ప్రజలను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నిన్న బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మునుగోడులో సమరభేరి పేరిట బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే.. ఈ సభలో పాల్గొనేముందు అమిత్ షా సికింద్రాబాద్‌లో మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే.. ఆ సమయంలో అమిత్ షా చెప్పులను బండి సంజయ్ పట్టుకున్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోపక్క ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలో తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. మునుగోడు ఆత్మగౌరవం నీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టాడని విమర్శించారు. కేంద్రం ఏం చేసింది అని కేసీఆర్ అడిగితే నోరు మెదపలేదని, విద్యుత్ రాకుండా నిషేధం పెట్టారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘ కృష్ణా లో నీటి వాటా తేల్చరు. తెలంగాణ ఎదుగుతుంటే సహకారం చేసేది వదిలేసి అడ్డుపుల్ల వేస్తున్నారు. మునుగోడులో లక్ష మందికి రైతు బందు అందింది. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు అని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు.
సెప్టెంబర్ 17 జెండా ఎగరేస్త ఏంటి… వేయకపోతే ఏంటీ. మీరు మొన్నటి వరకు జాతీయ జెండా నే ఎగరేయ లేదు. ఇప్పుడు జాతీయ జెండా గురించి మాట్లాడతారు. అమిత్ షా రాజకీయం చూడలేదా. ఢిల్లీ చెప్పు చేతుల్లో తెలంగాణ నాయకులు ఉన్నారు. బండి సంజయ్ లంగ..దొంగ.. గుండు. నీ ఆత్మగౌరవం అమిత్ షా దగ్గర తాకట్టు పెట్టినావు. మునుగోడులో ఆత్మ గౌరవ సభ అని ఒకడు… సమర భేరి అని ఇంకొకడు. మీ దాంట్లనే మీకు సభ పేరు ఎంటో చెప్పుకునే సఖ్యత లేదు. లిక్కర్ స్కాం మీద నిరాధార ఆరోపణ చేస్తుంది బీజేపీ. భయబ్రాంతులకు గురి చేసి భయ పెట్టాలని చూస్తుంది. కేసీఆర్ బిడ్డ కవిత. ఆమె మీద బురద చల్లే కుట్ర చేస్తుంది బీజేపీ. బురద జల్లి లబ్ధి పొందాలని చూస్తుంది. బీజేపీ పప్పులు ఉడకవు. కేసీఆర్ నీ భయపెట్టాలని చూస్తున్నారు. అయన ఎవడికి భయపడరు. బీజేపీ నాయకులందరూ షికండీలు, షిండేలు. అక్రమంగా తెలంగాణలో చొరబడేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ కక్షసాధింపు చర్యలకు పూనుకుంది. కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు.’ అన్నారు గాదరి కిషోర్.