MLA Sreedhar Reddy: వేలానికి ఎమ్మెల్యే ఆస్తులు..? తప్పుడు ప్రచారం.. నేను పారిపోయే వ్యక్తిని కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Sreedhar Reddy: పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు కెనరా బ్యాంకు సిద్ధం అయినట్టు వార్తలు వచ్చాయి.. ఆస్తులను వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కరోనా మహమ్మారి వల్ల బ్యాంకుకు రుణాలు చెల్లించడం ఆలస్యం అయ్యిందన్నారు.. మా పార్టీలో ఉన్న వాళ్లే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. రుణాలు ఎగ్గొట్టి వెళ్ళే ప్రసక్తే లేదు.. నేను పారిపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కంపెనీలో వ్యాపారం జరుగుతుంది.. రావాల్సిన బకాయిలు రావాలన్న ఆయన.. బ్యాంకులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నానని వెల్లడించారు.
Read Also: Locket Chatterjee: పశ్చిమ బెంగాల్‌లోనూ మణిపూర్ తరహా ఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ ఎంపీ
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
ఇక, వ్యాపారంలో ఒడిదుడుకులు రావడం సహజమే.. అంత మాత్రాన ఎగ్గొట్టి పోతారనడం దారుణం అన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.. కంపెనీకి 1500 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి. బకాయిలు రావాలి.. వచ్చిన వెంటనే చెల్లిస్తామని వివరణ ఇచ్చారు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలని హితవుపలికారు. శ్రీధర్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో నేను గెలవలేని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి.. ఇలాంటి జిమ్మిక్కులు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయం ఎదుర్కోలేక నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. కాగా, మెసర్స్ సాయిసుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. అయితే, వాటిని చెల్లించలేదు. ఇక, ఈ రుణాలకు శ్రీధర్ రెడ్డి హామీదారుడిగా ఉన్నారు. దీంతో కంపెనీతో పాటు, శ్రీధర్ రెడ్డి ఆస్తులను ఆగస్టు 18వ తేదీన వేలం వేయనున్నట్టు బ్యాంకు ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు