భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరం నిలిచింది. దేశంలో అక్షరాస్యత పరంగా రెండవ స్థానంలో ఉన్న ఈ రాష్ట్రం.. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. పిల్లలు ముందుకు సాగడానికి సాధ్యమైన అన్ని అవకాశాలను ఇస్తుందని హ్యాపియెస్ట్ స్టేట్ నివేదిక తెలిపింది. దీనిని దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా అభివర్ణించింది. గురుగ్రామ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్ స్టిట్యూట్ స్ట్రాటజీ ప్రొఫెసర్ రాజేశ్ కె పిలానియా నిర్వహించిన పరిశోధనలో మిజోరం అత్యంత సంతోషకరమైన రాష్ట్రమని తేలింది. భారతదేశంలో 100 శాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రంలో మిజోరం నిలిచింది. అత్యతం క్లిష్ట పరిస్తితుల్లోనూ ఈ రాష్ట్రం విద్యార్థులకు ఎదుగుదలకు అన్ని అవకాశాలు కల్పిస్తుందని నివేదిక పేర్కొంది. కుటుంబ సంబంధాలు, పనికి సంబంధించిన సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, ఆనందంపై కోవిడ్-19 ప్రభావం, శారీరక, మానసిక ఆరోగ్యం వంటి ఆరు అంశాల ఆధారంగా హ్యాపీనెస్ ఇండెక్స్ ను రూపొందించారు.
Also Read : Samantha: సామ్ వేసుకున్న ఆ డైమండ్ నెక్లస్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
ఐజ్వాల్ లోని ప్రభుత్వ మిజో హైస్కూల్ లో చదువుతున్న ఓ విద్యార్థికి తండ్రి కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయడంతో చిన్నప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ విద్యార్థిని పట్టు వీడకుండా చదవులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఏడో ఒక రోజు చార్టర్డ్ అకౌంటెంట్ లేదా సివిల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలనని ఆశాభావం వ్యక్తం చేశాడని నివేదిక అక్కడి పరిస్థితులపై ప్రస్తావించింది. నేషనల్ డిఫెన్స్ అకాడవీలో చేరాలని ఓ పదో తరగతి విద్యార్థి ఆకాంక్షించాడు. ఆమె అండ్రి పాల కార్మగారంలో పనిచేస్తుండగా.. తల్లి ఇంటిని చూసుకుటుంది. ఈ స్కూల్ కారణంగా ఈ ఇద్దరు విద్యార్థులు తమ భవిష్యత్ గురించి ఆలోచించగలుతున్నారు. మా టీచర్ మాకు బెస్ట్ ఫ్రెండ్ అని.. ఏదైనా చెప్పడానికి అడగాడానికి మాకు సిగ్గు, భయం లేదని ఆ పాఠశాలకు చెందిన మరో విద్యార్థి చెప్పాడు. ఇక్కడి ఉపాధ్యాయులు ప్రతిరోజు ఏ సమస్యలనైనా పిల్లలు.. వారి తల్లిదండ్రులతో పంచుకుంటారని నివేదికలో వెల్లడించారు.
Also Read : Jitesh Sharma : కంగనా రనౌత్, జాహ్నవిలో ఆ రెండంటే నాకు మస్తు ఇష్టం..
మిజోరం సామాజిక నిర్మాణం కూడా ఇక్కడి యువత సంతోషానికి దోహదం చేస్తుంది. ఇబెన్-ఇజార్ బోర్డింగ్ స్కూ్ల్ కు చెందిన సిస్టర్ లాల్రిన్మవి ఖియాంగ్టే మాట్లాడుతూ పిల్లల పెంపకం అనేది యువత సంతోసంగా ఉండాలా వద్దా.. మన సమాజం కులరహితరంగా ఉంది. అలాగే.. ఇక్కడ చదువు విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి ఒత్తిడిని సృష్టంచరు అని అన్నారు. మీజో కమ్యూనిటీలోని ప్రతి పిల్లవాడు.. అబ్బాయి లేదా అమ్మాయి అయినా చిన్న వయస్సులోనే సంపాదించడం ప్రారంభిస్తారని నివేదికలో తెలిపింది. ఇక్కడ ఏ విధమైన పనినైనా చేస్తారు. 16 లేదా 17 సంవత్సరాల వయస్సులో వారు పనిచేయడం ప్రారంభిస్తారు. దీనిని కూడా ప్రమోట్ చేస్తారు.. అదే సమయంలో బాల బాలికల మధ్య ఎలాంటి వివక్ష ఉండదని నివేదికలో వారు తెలిపారు.