Drugs Seized : డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం ఎంత కఠిన చర్యలు చేపట్టిన దందా కొనసాగుతూనే ఉంది. నిఘాను చేధించి మరీ దుండగులు డ్రగ్స్ ను దారి మళ్లిస్తున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్ విసురుతున్నారు. డ్రగ్స్ బారిన పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటుంటే.. స్వార్థపరులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. తాజాగా మిజోరాంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
Read Also: Crime News:కేసు విషయంలో స్టేషన్కు తీసుకుపోతే.. పోలీసులపై బాంబ్ వేసి పరారయ్యాడు
మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో రెండు చోట్ల మత్తుపదార్థాలను సీజ్ చేశారు.వీటి విలువ సుమారు 12 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా..రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం నలుగురు డ్రగ్ పెడ్లర్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు.ఒక చోట 98వేల డ్రగ్స్ మాత్రలను సీజ్ చేశారు.వీటి విలువ రూ.9.8 కోట్లు ఉంటుందని తెలిపారు.మరో ఘటనలో శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా..40 సబ్బుపెట్టెల్లో హెరాయిన్‌ను గుర్తించారు అధికారులు.దీని విలువ రూ.2.5కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.