Mitchell Starc: మిచెల్ స్టార్క్ సంచలన నిర్ణయం.. 9 ఏళ్ల తర్వాత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mitchell Starc Set To Play IPL in 2024: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఎట్టకేలకు తన నిర్ణయం మార్చుకున్నాడు. భారత టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరలా ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2024 వేలంలో తాను పాల్గొంటానని స్టార్క్ స్వయంగా ప్రకటించాడు. దాంతో 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఆడనున్నాడు. స్టార్ చివరిసారిగా 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడాడు.
2014, 2015 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మిచెల్ స్టార్క్ ఆడాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2016 సీజన్ ఆడలేదు. 2017లో ఐపీఎల్ ఆడకూడదని స్టార్క్ నిర్ణయం తీసుకున్నాడు. 2018లో వేలంలోకి రాగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతను ఆ సీజన్ ఆడలేదు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ కంపెనీతో అతడికి కేసు నడిచింది. ఆ కేసు 2020లో ముగిసింది.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
Also Read: Asia Cup 2023: మీ వల్లే భారీగా నష్టపోయాం.. పరిహారం కావాలంటూ జై షాను డిమాండ్ చేస్తున్న పాకిస్తాన్!
2019లో వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో చాలా మంది ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఐపీఎల్‌కు దూరంగా ఉన్నారు. అందులో మిచెల్ స్టార్క్ కూడా ఉన్నాడు. ఆపై టీ20 ప్రపంచకప్స్, యాషెస్, ద్వైపాక్షిక సిరీస్లతో స్టార్క్ చాలా బిజీగా గడిపాడు. మరోవైపు అతడి భార్య, ఆసీస్ మహిళా క్రికెటర్ అలీసా హేలీ కూడా చాలా బిజీగా గడిపింది. ఇన్ని ఏళ్లు ఆస్ట్రేలియా జట్టు, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన స్టార్క్.. ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. 2024 జూన్‌లో వెస్టిండీస్ మరియుఅమెరికాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. దానికి సన్నాహకంగా ఐపీఎల్ 2024ను వాడుకోవాలని స్టార్క్ చూస్తున్నాడు.
Mitchell Starc confirms his participation in the 2024 IPL auction.
Welcome back to IPL, Starc…!!! pic.twitter.com/74jDcYgSUs
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2023
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!