మణిపూర్ కేబినెట్‌లో ఏకైక మహిళ మంత్రిగా ఉన్న నెమ్చా కిప్‌జెన్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఇంఫాలో ఉన్న మంత్రి అధికారిక నివాసానికి దుండగులు నిప్పంటించినట్లు ఒక అధికారి వెల్లడించారు. కాగా ఈ ఘటన జరిగినప్పుడు బీజేపీ నాయకురాలైన మహిళ మంత్రి నెమ్చా కిప్‌జెన్ కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇంట్లో లేరని తెలిపారు. ఆమె కుకీ కమ్యూనిటీకి చెందినది.. కాగా ఇది మెయిటీస్ వర్గీయులే దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read : Australia: పార్లమెంట్‌లోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను: ఆస్ట్రేలియా సేనేటర్
అయితే ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంఫెల్ ప్రాంతంలో బుధవారం రాత్రి మణిపూర్ మంత్రి నెమ్చా కిప్‌జెన్ అధికారిక నివాసానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. మంటలు పక్క భవనాలకు వ్యాపించకముందే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గత కొన్ని రోజులుగా మణిపూర్‌లో మెయిటీ మరియు కుకీ కమ్యూనిటీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ హింసాకాండలో దాదాపు 115 మందికి పైగా మరణించారు.. 300 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 60,000 మంది 350 సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
Also Read : MVV Satyanarayana Family: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు కిడ్నాప్
మంగళవారం రాత్రి, కాంగ్‌పోక్పి- ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దులో ఉన్న ఐగేజాంగ్ గ్రామంలో హింసలో తొమ్మిది మంది వ్యక్తులు మరణించారు మరియు 10 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే.. ఎస్టీ రిజర్వేషన్ లో మార్పులు చేసినప్పటి నుంచి మణిపూర్ లో తీవ్ర అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో 115 మంది వరకు మృతి చెందారు. రాష్ట్రంలో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.