Vishaka MP MVV Satyanarayana Family Kidnapped: ఏపీలో కిడ్నాప్ కలకలం రేగింది. ఏకంగా అధికార వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీలను కిడ్నాపర్లు అపహరించారని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం రిషికొండలోని ఆయన ఇంట్లోకి దూరిన దుండగులు వారిని కిడ్నాప్ చేశారని చెబుతున్నారు. ఉదయం 6-7 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైదరాబాద్ లో ఉన్నారని సమాచారం. ఉదయం ఎంపీ ఇంటికి చేరుకున్న దుండగులు సీతమ్మధారలో ఉన్న ఆడిటర్ జీవీకి ఎంపీ భార్యతోదుండగులు భయపెట్టి ఫోన్ చేయించారు.
ఆయన వచ్చాక ముగ్గురిని కలిపి అపహరించారు. అయితే నిజానికి ఎవరు చేశారు అనే సమాచారం ప్రాధమికంగా లేకపోయినా రౌడీ షీటర్ హేమంత్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎంవీవీ వర్గీయులు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు సినిమాల నిర్మాణం కూడా చేస్తూ ఉంటారు. ఎంపీకి చెందిన కంపెనీలకు అడిటర్ గా జీవీ వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీలకు మాత్రమే కాక ఇతర కంపెనీలకు కూడా జీవీ ఆడిటర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక ఈ వ్యాపార గొడవలే కిడ్నాప్ కు కారణమయ్యాయా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధికార పార్టీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కావడంతో పూర్తి వివరాలను పోలీసులు బయట పెట్టడం లేదు. అలాగే ఈ విషయం మీద అధికారిక ప్రకటన కూడా లేదు. కిడ్నాప్ అయిన సమాచారం మాత్రమే వెలుగులోకి అది కూడా ఆలస్యంగా వచ్చింది. మరోపక్క ఆడిటర్ ఆచూకీ లభ్యం అయిందని కూడా అంటున్నారు కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.