New Pensions: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వారికి కూడా పెన్షన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని కార్మిక వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో ఆయన పాల్గొని పలు కీలక హామీలు ఇచ్చారు.
కార్మికులకు భరోసా..
భవన నిర్మాణ రంగ కార్మికుల చిరకాల వాంఛ అయిన పెన్షన్ల అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వీరికి పింఛన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని, అలాగే ప్రతి జిల్లాలో కార్మిక సంఘాల కోసం ప్రత్యేక సంఘ భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలోనే ‘లేబర్ బోర్డు’ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, లేబర్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, ప్రమాద బీమా మరియు ఇతర సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.
Also Read
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్‌చేస్తే..
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
Also Read:MGNREGS: ఉపాధి హామీకి కౌంట్ డౌన్.. ఫుల్ పవర్స్ వారికే..
తమ కుటుంబానికి కార్మికులతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. తన తండ్రి, దివంగత నేత కాకా వెంకటస్వామి సింగరేణి కార్మికుల కోసం చేసిన పోరాటాలను మంత్రి ప్రస్తావించారు. అదే బాటలో నడుస్తూ.. గిగ్ వర్కర్ల రక్షణ కోసం అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తెచ్చామని, ప్రమాద బీమాను రూ. 10 లక్షలకు పెంచామని గుర్తుచేశారు. హమాలీల సంక్షేమం కోసం కూడా ప్రత్యేక చట్టం తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీశ్ రావు కేవలం ఓట్ల కోసమే హామీలు ఇచ్చారని.. కానీ తమ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మార్పు తెస్తుందన్నారు. సిద్దిపేట కార్మిక భవన నిర్మాణానికి స్థల కేటాయింపుతో పాటు నిధులు కూడా మంజూరు చేస్తానని మాట ఇచ్చారు.
తాజావార్తలు
-
SSMB29: ‘వారణాసి’ ఓటీటీ డీల్‌కే వేల కోట్ల ఆఫరా..? రాజమౌళి సినిమా కోసం దిగ్గజ సంస్థల పోటీ!
-
Producer Narsamma: సినిమా తీసి సర్వం కోల్పోయాం.. ‘ప్రభాస్’ గారు మాకు మీరే దిక్కు: మహిళా రైతు నిర్మాత
-
Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్‌చేస్తే..
-
KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం!
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!