PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- భారత అథ్లెట్లతో ప్రధాని మోడీ భేటీ
- ఆసియా క్రీడల పతక విజేతలకు అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games Medal Winners Meet PM Modi: జపాన్‌లోని ఐచి-నగోయాలో జరిగిన ఆసియా క్రీడలు 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 15న న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించిన ప్రధాని.. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత యువత తమ ప్రతిభను నిరూపించుకుంటోందని అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 85 పతకాలు సాధించింది. వీటిలో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత క్రీడాకారుల ప్రదర్శన దేశంలో మారుతున్న క్రీడా సంస్కృతికి నిదర్శనమని మోదీ వ్యాఖ్యానించారు.
క్రీడాకారులతో మాట్లాడిన ప్రధాని మోడీ.. దేశ గౌరవాన్ని పెంచిన విజేతలకు అభినందనలు తెలిపారు. క్రీడాకారుల కృషి, పట్టుదల విజయంగా మారినప్పుడు పతకాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ విజయాల వెనుక క్రీడాకారులతో పాటు వారి కోచ్‌లు, సహాయక సిబ్బంది, కుటుంబ సభ్యుల కృషి కూడా ఉందని అన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ప్రస్తావిస్తూ ఆయనకు నివాళులర్పించారు.
Also Read
- Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..
- Thiruparankundram Deepam Controversy: కార్తీక దీపం వివాదంలో మరో ట్విస్ట్...! గవర్నర్ సీరియస్.. సీఎం విజయ్‌కు కీలక ఆదేశాలు!
- AP BSF Jawan Dies on Indo-Bangladesh Border: స్మగ్లర్ల వేటలో విషాదం.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీ జవాన్ మృతి..
- Suvendu Adhikari: బీజేపీలో చేరాలని ప్రణబ్ ముఖర్జీనే సలహా ఇచ్చారు..! సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు
ఆసియా క్రీడల్లో భారత మహిళల, పురుషుల హాకీ జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. అలాగే మహిళల, పురుషుల క్రికెట్ జట్లు కూడా బంగారు పతకాలు గెలుచుకున్నాయి. మహిళల హాకీ జట్టు స్వర్ణం సాధించడం 44 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కబడ్డీలోనూ భారత మహిళల, పురుషుల జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి.
మహిళా క్రీడాకారుల ప్రతిభపై ప్రత్యేక ప్రశంసలు
భారత మహిళా క్రీడాకారుల ప్రదర్శనను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. మొత్తం 85 పతకాలలో మహిళా అథ్లెట్లు 38 పతకాలు సాధించారని, వాటిలో 11 స్వర్ణ పతకాలు ఉన్నాయన్నారు. పతకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కాదని, అవి నూతన భారతదేశ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని మోడీ వ్యాఖ్యానించారు. గతంలో భారత్ పెద్దగా పతకాలు సాధించని కొన్ని క్రీడాంశాల్లోనూ ఈసారి విజయాలు అందుకున్నట్లు తెలిపారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA), సాఫ్ట్ టెన్నిస్, సెయిలింగ్ వంటి విభాగాలను ఉదాహరణలుగా ప్రస్తావించారు.
క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించిన ప్రధాని
తన ప్రసంగంలో భాగంగా క్రీడాకారులకు కొన్ని లక్ష్యాలను నిర్దేశిస్తూ, వాటిని సాధిస్తామని ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని కోరారు.
ప్రతి మైదానంలో త్రివర్ణ పతాకానికి గౌరవం తీసుకురావడం.
క్రీడల్లో భారత్‌కు కొత్త గుర్తింపు తీసుకురావడం.
ప్రతి క్రీడలో కొత్త ఛాంపియన్లను తయారు చేయడం.
కొత్త రికార్డులను నెలకొల్పడం.
విజయాలు ఒక్కరోజులో సాధ్యం కావని, వాటి కోసం ఎన్నో సంవత్సరాల పాటు ఓర్పుతో కృషి చేయాలని ప్రధాని అన్నారు. గత 12 సంవత్సరాలుగా దేశంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. గతంలో భారత్ కొన్ని క్రీడాంశాల్లో పాల్గొనడానికే పరిమితమయ్యేదని, ఇప్పుడు విభిన్న క్రీడల్లో పాల్గొనడంతో పాటు పతకాలు కూడా సాధిస్తోందని అన్నారు.
భారత హాకీ జట్లు ప్రధానికి జెర్సీల బహూకరణ
ప్రధానితో సమావేశమైన భారత మహిళల, పురుషుల హాకీ జట్లు ప్రధానికి తమ జెర్సీలను బహూకరించారు. మహిళల హాకీ జట్టు స్వర్ణ పతక పోరులో చైనా జట్టును 1-0తో ఓడించి ఈ విజయంతో 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పురుషుల హాకీ జట్టు ఫైనల్లో మలేషియాపై 5-1 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడంతో పాటు ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
Our Asian Games champions have made the Tricolour fly high! Their achievements show what passion, perseverance and belief can achieve. https://t.co/m3gOPecQCo
— Narendra Modi (@narendramodi) October 15, 2026
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్‌ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!