Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Venugopala Krishna Challenge To Pawan Kalyan

Minister Venugopala Krishna: దమ్ముంటే ద్వారంపూడి ఛాలెంజ్‌ను పవన్‌ స్వీకరించాలి..

Published Date :June 19, 2023 , 4:54 pm
By Sudhakar Ravula
Minister Venugopala Krishna: దమ్ముంటే ద్వారంపూడి ఛాలెంజ్‌ను పవన్‌ స్వీకరించాలి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Venugopala Krishna: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే ఎమ్మెల్యే ద్వారంపూడి ఛాలెంజ్‌ను స్వీకరించాలి సవాల్‌ చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేన పార్టీలోకి వచ్చి పోయిన వారి సంగతి ఏంటో పవన్ చెప్పాలన్నారు.. పదే పదే కులం గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం ? సమ సమాజం కోసం మాట్లాడే తీరు ఇదేనా? అంటూ ప్రశ్నించారు. గోదావరి జిల్లాలలో పవన్ అశాంతిని నెలకొల్పుతున్నారని ఆరోపణలు గుప్పించిన ఆయన.. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడడం హాస్యాస్పదం అని హితవుపలికారు.. 2019 సంవత్సరంలో మీరు చేసిన ప్రయత్నం ప్రజాభిమానం పొందలేదని స్పష్టం చేశారు.

Read Also: Ganesh Movie: పాతికేళ్ళు పూర్తి చేసుకున్న ‘గణేశ్’

ఇక, కాకినాడ వచ్చి పదే పదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ పవన్‌ కల్యాణ్‌పై ఫైర్‌ అయ్యారు మంత్రి చెల్లుబోయిన.. పవన్‌కు దమ్ముంటే.. ద్వారంపూడి చెప్పిన ఛాలెంజ్ ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు.. వారాహిని.. నారాహిగా మార్చారంటూ ఎద్దేవా చేశారు.. మరోవైపు.. 2018లో తనకు ప్రాణహాని ఉందని పవన్‌ కల్యాణ్‌ అన్నారని గుర్తుచేశారు.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ.. సమాజంలో సముచిత స్థానం కలిగిన వ్యక్తిగా ఉన్నారని తెలిపారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

Read Also: No Broker: ‘నో బ్రోకర్’ పెట్టిన చిచ్చు.. కొడుకును కత్తితో పొడిచిన తండ్రి

కాగా, పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం విదితమే.. సీఎం వైఎస్‌ జగన్ అండ చూసుకొని రెచ్చిపోతున్న ద్వారంపూడి ఆటలు ఇకపై సాగనివ్వమని హెచ్చరించిన ఆయన.. ఈసారి ఎన్నికల్లో ద్వారంపూడిని గెలవనివ్వనంటూ సవాల్ చేశారు. తాను ఏపీకి వచ్చేశానని. మంగళగిరిలో ఉంటానని. ఎవరొస్తారో రండి చూసుకుందామంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. ఇక, అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు ఎమ్మెల్యే ద్వారంపూడి.. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు జనసేన ఎవరి బాగు కోసం.. రాష్ట్రం కోసమా. చంద్రబాబు కోసమా..? అంటూ నిలదీశారు.. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఉన్నవాళ్లంతా ఇప్పుడు పవన్‌తో ఉన్నారా? అని నిలదీశారు. తాను రెండు సార్లు పోటీ చేసి గెలిచానని. పవన్ రెండు చోట్లా ఓడిపోయాడంటూ ఎద్దేవా చేశారు. పవన్ ఆరోపించినట్లు తాను రౌడీని అయితే జనం తనను రెండు సార్లు ఎందుకు గెలిపిస్తారంటూ పవన్‌పై విరుచుకుపడ్డారు.. అంతేకాదు.. నీకు దమ్ముంటే కాకినాడలో నాపై పోటీ చేయి అంటూ పవన్‌ కల్యాణ్‌కు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి సవాల్‌ విసిరిన విషయం విదితమే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • janasena
  • minister venugopala krishna
  • pawan kalyan
  • YSRCP

తాజావార్తలు

  • AP Capital Amaravati: అమరావతి రాజధానిగా హర్షం.. కానీ ఉద్యోగుల కష్టాలు తీరేదెప్పుడు? APJAC సూటి ప్రశ్న.!

  • Iran-US War: ఏ పాపం చేసిందని అధికారి భార్యను చంపేశారు.. ప్రపంచానికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ సూటి ప్రశ్న

  • Adivi Sesh: నా సినిమాలతో అందరూ బాగుపడ్డారు.. అడివి శేష్ ఎమోషనల్!

  • Healthy Summer Drinks : షుగర్, బీపీ ఉన్నవారికి సైతం బెస్ట్ సమ్మర్ డ్రింక్.. ఈ హెల్తీ డ్రింక్‌ను సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • Nuzvid: రైస్ పుల్లింగ్ పేరుతో 2.5 కోట్ల ఘరాన మోసం బట్టబయలు..!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions