iPhone 14 Plus to get Rs 20,000 above discount in Flipkart Big Billion Days Sale 2023: ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో త్వరలో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ఆరంభం కానుంది. అక్టోబర్ 8న మొదలయ్యే ఈ సేల్ అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఒకరోజు ముందుగానే ఆఫర్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో తన బ్లాక్‌బస్టర్ డీల్‌లకు సంబందించిన పోస్టర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఐఫోన్ 14 డీల్స్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా యాపిల్ ఫోన్‌లు రూ. 20,000 కంటే ఎక్కువ ధర తగ్గింపును పొందే అవకాశం ఉంది. కార్డులను కూడా ఉపయోగిస్తే.. రూ. 50-60 లోపు ఐఫోన్ 14 సిరీస్ ఫాన్స్ కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం ఐఫోన్ 14 (APPLE iPhone 14 Blue, 128 GB) ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 69,900గా ఉంది. ఇప్పుడు 7 శాతం తగ్గింపు అనంతరం రూ. 64,999కి అందుబాటులో ఉంది. అయితే బిగ్ బిలియన్ డేస్ సమయంలో ఈ ఫోన్ రూ. 50,000 లోపు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. బ్యాంకు ఆఫర్స్ అప్లై చేస్తే ఈ ధర మరింత తగ్గనుంది. ఇక ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా ఐఫోన్ 14ను చౌకైన ధరకు సొంతం చేసుకోవచ్చు.
Also Read: ICC Cricket World Cup 2023: తెలుగులో ఫ్రీగా వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు.. రంగంలోకి మిథాలీ రాజ్!
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్ (APPLE iPhone 14 Plus Blue, 128 GB) ధర ఇప్పుడు రూ. 73,999గా ఉండగా.. సేల్ సమయలో రూ. 60,000 లోపు ఉండే అవకాశం ఉంది. బ్యాంకు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా ఐఫోన్ 14 ప్లస్ ధర మరింత తగ్గనుంది. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్స్ ధరలను, ఆఫర్ వివరాలను ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఫ్లాష్ ధరను లాక్ చేసుకునే అవకాశం కూడా కొనుగోలుదారులకు ఇవ్వబడింది. లాక్ ధర కోసం రూ. 1999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ బిగ్ బిలియన్ డేస్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా చుస్తున్నారు. మరి ఫ్లిప్‌కార్ట్ ఎంత తగ్గింపు ఇస్తుందో చూడాలి.