Minister RK Roja: ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో నగరి నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విభేదాలు మరింత రచ్చకెక్కుతున్నాయి.. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ.. మంత్రి రోజాపై విమర్శలు గుప్పిస్తున్నారు.. ఆ నియోజకవర్గంలోని కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు.. అయితే, వారికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా.. నగరిలోని తన వ్యతిరేకవర్గం నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. ‘జగనన్న ముద్దు.. రోజమ్మ వద్దు..’ అంటూ ప్రతిరోజు 500 కట్టి ప్రెస్ క్లబ్ లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీరు పార్టీలో ఉండడం వల్లే నగరిలో 500 ఓట్లు మెజార్టీ వస్తుంది.. మీరు పార్టీ నుండి బయటకు వెళ్తే.. నగరిలో 30,40 వేల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Suriya: హీరో సూర్య లేటెస్ట్ లుక్ చూశారా.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడుగా..
ఇక, మీరు మాట్లాడినట్టుగా నావాళ్లు మాట్లాడితే మీరుతట్టుకోలేగలరా..? బతకగలరా..? అంటూ మండిపడ్డారు మంత్రి రోజా.. నగరిలో మాట్లాడడానికి మొహం లేక తిరుపతిలో కూర్చొని నగిరి పేరు ప్రతిష్టలు దిగజారుస్తున్నారని దుయ్యబట్టారు.. అంతేకాదు.. మనందరినీ కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు.. వారందరికీ బుద్ది చెప్పే సమయం వచ్చిందని హెచ్చరించారు. నగరిని ఎవరు చేయని విధంగా అభివృద్ధి చేశాను అని తెలిపారు. నగరిలో ప్రతిపక్షాలతో పాటు మన పార్టీలో తల్లిపాలు తాగి రొమ్ములు గుద్ది ఉంటున్న వెన్నుపోటు దారులతో పోరాటం చేస్తున్నాను అన్నారు. వారితో పోరాడుతూ ఇంకోపక్క ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధిని అందిస్తున్నాను అని వెల్లడించారు. జగనన్న ఏ విధంగా ప్రతిపక్షాలతో పోరాడుతూ ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీయిస్తున్నారో.. నేను అలానే చేస్తున్నాను అన్నారు మంత్రి ఆర్కే రోజా.