పెళ్లి పత్రిక అనగానే.. అందులో కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు.. బంధుమిత్రుల శుభాకాంక్షలు.. తల్లిదండ్రుల దీవెనలు.. అంటూ., అదికూడా లేదంటే ఇంట్లోనే పెద్దవారి ఆశీస్సులు అంటూ కార్డ్స్ ను ముద్రిస్తుంటారు. కానీ తెలంగాణలో ఓ యువకుడు మాత్రం తన పెళ్లి పత్రికలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను ముద్రించాడు. దాంతో అతను మోడీ మీద తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు.
Also Read: Kaushik Reddy: పొన్నం ప్రభాకర్ ను ఆవేశం స్టార్ అని పిలవాలి..
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా ఆరుట్లలో బీజేపీ కార్యకర్త ఈ వినూత్న ప్రచారం చెప్పుట పనిలో పడ్డాడు. తన పెళ్లి కార్డుపై మోడీ ఫోటో వేసి ” నా పెళ్ళికి మీరు ఇచ్చే బహుమతి.. నరేంద్ర మోడీకి మీరు వేసే ఓటు ” అంటూ ప్రింట్ చేయించి కార్డ్స్ పంచడంతో పాటు బీజేపీ కి మరొక స్టైల్ లో ప్రచారం చేస్తున్నాడు వరుడు. ఇలా చాలామంది వారి కొత్త ఆలోచనలతో ట్రెండ్ కు తగా పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
Also Read: Himachal Pradesh: రసవత్తరంగా హిమాచల్ రాజకీయాలు..బీజేపీలోకి కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యేలు..
అయితే, ఇలా పెళ్లి పత్రికలపై మోడీ బొమ్మను ముద్రించడం ఇది మొదటిసారెమి కాదు. ఈ ట్రెండ్ ను మొదట భైంసాకు చెందిన ఎడ్ల మహేష్ అనే వ్యక్తి మొదలు పెట్టి., తన పెళ్లి పత్రికలో మోడీ ఫొటో వేసి అభిమానాన్ని చాటుకున్నాడు. అప్పటినుంచి అనేకమంది యువకులు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.