Minister Ramprasad Reddy Slams YSRCP: రోడ్డు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ… రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. సింగపూర్ లాగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పదేళ్ల ముందే మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా సింగపూర్ ప్రభుత్వ ఆర్కిటెక్ లతో అద్భుతమైన డిజైన్ చేయించారన్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వేల కోట్ల రూపాయలు అక్రమాలు చేశారని ఆరోపించిందని తెలిపారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని స్పష్టం అయ్యిందన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టేలా సీఎం ప్రణాళికలు చేస్తున్నారని వెల్లడించారు. కళ్లులేని వైసీపీ కబోధులు దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేకే వైసీపీ విమర్శలు చేస్తోందని తెలిపారు. కక్ష్య పూరితంగా చర్యలు తీసుకోవాలంటే వైసీపీ నాయకులను ఇప్పటికే అరెస్ట్ చేసి ఉండొచ్చు.. మేము వైసీపీ నాయకులను ఎవరిని టచ్ చేయలేదని చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన వారిని చట్ట పరంగా శిక్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
READ MORE: Raja Singh: రాజా సింగ్.. రా అంటే వెంటనే పార్టీలోకి వెళ్లిపోతా!
నకిలీ డిస్లరీలు ఏర్పాటు చేసి వేలాదిమంది ప్రాణాలు బలిగొన్నారని రాంప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చెప్తే.. న్యాయస్థానాలు, జడ్జీలు శిక్ష వేసే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని.. ప్రభుత్వంలో ఉన్న సమయంలో తప్పు చేశారు కాబట్టే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు రోజా క్రమశిక్షణగా ఉన్నారని చెప్పారు. వైసీపీలోకి వెళ్లిన తరువాత రోజా క్రమశిక్షణ తప్పారని విమర్శించారు. రోజాపై అభాండాలు, విమర్శలు తాము చేయమని.. మహిళలు అంటే ఈ ప్రభుత్వానికి చాలా గౌరవం ఉందన్నారు. మహిళలకు మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వబోతున్నామని తెలిపారు. వాళ్ల నాయకుని వద్ద మెప్పు పొందేందుకు రోజా ప్రయత్నాలు చేస్తోందన్నారు. స్కాములు, తప్పులు చేసిన వారు జైల్లోకి వెళ్తున్నారని.. వైసీపీ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారన్నారు.