Site icon NTV Telugu

Ponnam Prabhaka: కాళేశ్వరంలో బాంబులు పెట్టారన్న కేటీఆర్.. సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి డిమాండ్!

Ponnam Prabhakar

Ponnam Prabhakar

కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో బాంబులు పెట్టారని కేటీఆర్ అంటున్నారని.. కేటీఆర్ అడుగుతున్నట్టు కాళేశ్వరంలో బాంబులు పెట్టినట్టు అయితే కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐతో విచారణ చేయించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. హనుమకొండ జిల్లా ములకనూరులో మంత్రి మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం ఏంటని సొంత కూతురు కవితనే కేసీఆర్ ను అడుగుతున్నారన్నారు. అధికారంలో ఉన్న వారు ప్రాజెక్ట్ లు నిర్మించడంలో విఫలం అయితే ఆ చెడ్డపేరు కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు నిర్మిస్తుందని.. ప్రాజెక్ట్ లు కూలగొట్టదన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

READ MORE: Sailajanath: జగన్‌పై తప్పుడు ఆరోపణలు.. మద్యం అక్రమాలపై ఒక్కొక్కరు ఒక్కో రీతిలో కామెంట్లు..

కాగా.. నిన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ఒక బ్యారేజీలో 2 పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ పగుళ్లకు బహుశా కాంగ్రెస్‌ వాళ్లే కారణం కావొచ్చని ఆరోపించారు. వాళ్లే మేడిగడ్డకు బాంబులు పెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. కమీషన్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కాళేశ్వరం డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఘోష్ విచారణ పూర్తయిందని అని చెప్పి.. ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. బాంబులు పెట్టారన్న వ్యాఖ్యలపై నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

READ MORE: India Pakistan: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసేందుకు భారత్ మాస్టర్ ప్లాన్..

Exit mobile version