మేము ఆ రెండు పార్టీలకి జవాబు దారి కాదని కాంగ్రెస్, బీఆర్ఎస్‌ని ఉద్దేశించి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎన్ని తిట్టినా తమకు పోయేదేమీ లేదని స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు పార్టీలో ఒకరికొకరు ఒప్పందం కుదుర్చుకొని బీజేపీపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దోచుకుంటున్నారని విమర్శించారు.
కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో బాంబులు పెట్టారని కేటీఆర్ అంటున్నారని.. కేటీఆర్ అడుగుతున్నట్టు కాళేశ్వరంలో బాంబులు పెట్టినట్టు అయితే కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐతో విచారణ చేయించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. హనుమకొండ జిల్లా ములకనూరులో మంత్రి మాట్లాడారు.
Lokayukta MUDA Probe: కర్ణాటక హైకోర్టు గురువారం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంపై లోకాయుక్త పోలీసుల విచారణ నివేదికను జనవరి 28లోపు సమర్పించేందుకు గడువు పొడిగించింది. డిసెంబర్ 24 నాటికి లోకాయుక్త నివేదికపై పురోగతిని చూపించాల్సిందని ఆదేశించిన కింది స్థాయి కోర్టు ఆదేశాలను, హైకోర్టు ఇప్పుడు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్నా ఉండగా.. జనవరి 28 వరకు లోకాయుక్త నివేదిక సమర్పించకూడదని ఆదేశించారు. Also Read: CM…