ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. తినడానికి తిండి తాగటానికి మంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఏ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది.
Also Read: Nagarjuna : ‘కూలీ’ కోసం నాగార్జున అంత తీసుకున్నాడా.. అంత మార్కెట్ ఉందా..?
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. తాజగా గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీయార్ ” రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళం గా ప్రకటిస్తున్నాను” అని తెలిపారు. ఇక మరొక యంగ్ హీరో విశ్వక్ సేన్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా రూ. 5 లక్షలు విరాళం ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు. ఇటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 5 లక్షలు విరాళం అందించాడు. తమను ఆరాధించే ప్రజలు కష్టాలలో తోడుగా తమ వంతు భాద్యతగా చిత్రపరిశ్రమ ముందుకు రావడం అభినందించదగ్గ విషయం.