Minister Nara Lokesh: ఏ ఘటననూ ఉపేక్షించేది లేదు.. ఏ నిందితుడినీ వదిలేది లేదు..
- వైఎస్ జగన్ కు మంత్రి లోకేష్ కౌంటర్..
- గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు పోయి నెల దాటింది..
- మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలిస్తాం..
- ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం..
- ఏ ఘటననూ ఉపేక్షించేది లేదు.. ఏ నిందితుడినీ వదిలేది లేదన్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: రాష్ట్రంలో ఏ ఘటననూ ఉపేక్షించేది లేదు.. ఏ నిందితుడినీ వదిలేది లేదని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలో హిసం, విధ్వసం, అరాచకం, అన్యాయం జరుగుతుందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చిన ఆయన.. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోందని దుయ్యబట్టారు.. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటిందన్న మంత్రి లోకేష్.. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి వేస్తోందన్నారు.
Read Also: IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. కెప్టెన్ రోహిత్ శర్మనే!
Also Read
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
- Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్.. తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు లోకేష్.. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని విమర్శించారు. శవాలతో రాజకీయాలు చేసే విష సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు. నేరాలు చేసి.. మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే జగన్ కపట నాటకాలకు కాలం చెల్లింది. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఏ ఘటననూ ఉపేక్షించేది లేదు.. ఏ నిందితుడినీ వదిలేది లేదు అని హెచ్చరించారు. ఇక, బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు.. జగన్ హెచ్చరికలు భయపడే ప్రభుత్వం కాదు.. ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇది అని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్.
హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోంది. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి…
— Lokesh Nara (@naralokesh) July 18, 2024
తాజావార్తలు
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..