Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mana Jampala: సాధారణంగా 12 ఏళ్ల పిల్లలు ఏం చేస్తారు? స్కూల్ హోంవర్క్, ఆటలు, స్నేహితులతో సరదాగా గడపడం.. వంటివి చేస్తారు. కానీ, కెనడాలోని బ్రిటీష్ కొలంబియా (కెలౌనా)కు చెందిన 7వ తరగతి విద్యార్థిని ‘మాన జంపాల’ మాత్రం వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూనే.. ఏకంగా మూడు దేశాల్లో విస్తరించిన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ కంపెనీని నడుపుతోంది. గ్లోబల్ లెవెల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అత్యంత పిన్న వయస్కురాలైన ఏఐ ఫౌండర్లలో మాన ఒకరిగా నిలిచింది. బిజినెస్‌లకు వచ్చే కస్టమర్ ఫోన్ కాల్స్ ఏవీ మిస్ కాకుండా చూసేందుకు మాన ‘వోక్సా’ (Voxa) అనే ఏఐ-ఆధారిత రిసెప్షనిస్ట్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే కెనడా, భారతదేశం, కాంబోడియా దేశాల్లోని కంపెనీల్లో విజయవంతంగా రన్ అవుతోంది.
తొమ్మిదేళ్లకే కోడింగ్ ప్రయాణం:
సాంకేతికతపై మానకు చిన్నతనం నుంచే ఆసక్తి ఎక్కువ. కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే స్క్రాచ్ క్యాంప్‌ల ద్వారా కోడింగ్ నేర్చుకుని, ఆపై ‘పైథాన్’ (Python) లాంగ్వేజ్‌పై పట్టు సాధించింది. 11 ఏళ్ల వయసు వచ్చేసరికి సొంతంగా ఏఐ ప్రొడక్ట్స్‌ను తయారు చేయడం ప్రారంభించింది. ఆమె ప్రతిభకు స్కూల్ దాటి గుర్తింపు లభించింది. ఇండియా పర్యటనలో ఉన్నప్పుడు ఒక కాలేజీ స్థాయి సైన్స్ పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. అలాగే, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ‘1517 ఫండ్’కు చెందిన మెడిసి ప్రాజెక్ట్ నుంచి గ్రాంట్ (ఆర్థిక సాయం) కూడా అందుకుంది. ఇంత పెద్ద కంపెనీని రన్ చేస్తున్నప్పటికీ.. మానకు ఫుట్‌బాల్ ఆడటం, ఫ్రెండ్స్‌తో గడపడం, తనలాంటి ఇతర యువ బిల్డర్లను కలవడం అంటే చాలా ఇష్టం.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ఆ ఒక్క మిస్డ్‌కాల్‌తో మారిన ఆలోచన:
వోక్సా స్టార్టప్‌కు గల ఐడియా తన తండ్రి ఆఫీస్ నుంచే పుట్టింది. ఆఫీసులో ఉద్యోగులు కస్టమర్లకు సేవలు అందించడంలో బిజీగా ఉండటం వల్ల చాలా ఫోన్ కాల్స్ మిస్ అవ్వడాన్ని మాన గమనించింది. అలా మిస్ అయిన ప్రతి కాల్.. వ్యాపార అవకాశాన్ని కోల్పోవడమే అని గ్రహించింది. ఈ చిన్న పరిశీలనే ‘వోక్సా’ పుట్టుకకు కారణమైంది. రెస్టారెంట్లు, ఫార్మసీలు, ఇతర సేవా రంగాల వ్యాపారాల కోసం 24 గంటలూ పనిచేసేలా ఈ ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను డిజైన్ చేసింది. ఈ సిస్టమ్ కస్టమర్ల కాల్స్‌కు సమాధానం ఇవ్వడమే కాకుండా.. అపాయింట్మెంట్లు బుక్ చేయడం, రెస్టారెంట్ ఆర్డర్లు తీసుకోవడం, ఫాలో-అప్‌లను నిర్వహించడం, ప్రతి సంభాషణ తర్వాత ఒక సారాంశాన్ని (Summary) కూడా తయారు చేసి ఇస్తుంది. ప్రస్తుతం కెనడా వ్యాప్తంగా వందలాది కాల్స్‌ను ఈ సిస్టమ్ విజయవంతంగా హ్యాండిల్ చేస్తోంది.
ఏఐ సాయం తీసుకుంది.. కానీ దానికి బానిస కాలేదు:
బిజినెస్ ఇన్సైడర్తో మాన మాట్లాడుతూ.. ఈ ప్రొడక్ట్ బిల్డ్ చేయడానికి తాను చాట్ జీపీటీ (ChatGPT), క్లాడ్ (Claude) వంటి ఏఐ కోడింగ్ అసిస్టెంట్ల సాయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే, మొత్తం ప్రొడక్ట్‌ను ఏఐ ద్వారా ఒకేసారి తయారు చేయించకుండా.. చిన్న చిన్న కోడింగ్ ముక్కలను జనరేట్ చేస్తూ, వాటిని జాగ్రత్తగా టెస్ట్ చేసి, బగ్‌లను (తప్పులను) తనే స్వయంగా ఫిక్స్ చేస్తూ బ్యాకెండ్ను రూపొందించింది. ఈ స్టెప్-బై-స్టెప్ విధానం సాఫ్ట్‌వేర్‌లోని ప్రతి భాగాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి తనకు సహాయపడిందని మాన వివరించింది.
తదుపరి లక్ష్యం.. ‘ఏఐ ఏజెంట్స్’:
కేవలం ఏఐ రిసెప్షనిస్ట్తోనే మాన ఆగిపోవడం లేదు. ఆమె తన తదుపరి అడుగుగా ‘వోక్సా ఏజెంట్స్’ (Voxa Agents) అనే కొత్త వెంచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు తమకు కావాల్సిన పనిని సాధారణ ఇంగ్లీషులో వివరిస్తే చాలు.. స్వయంప్రతిపత్తి కలిగిన (Autonomous) ఏఐ ఏజెంట్లు ఆ పనిని ఆటోమేటిక్‌గా పూర్తి చేస్తాయి. ఉదాహరణకు.. కాంపిటీటర్స్‌ను ట్రాక్ చేయడం, మీటింగ్ బ్రీఫింగ్స్ సిద్ధం చేయడం లేదా ఆన్లైన్ సంభాషణలను పర్యవేక్షించడం వంటి పనులను ఇవి సులువుగా చేసేస్తాయి. ఇక, భవిష్యత్తులో ఈ కంపెనీని మరింత విస్తరించి, ఒక ప్రముఖ స్టార్టప్ యాక్సిలరేటర్‌లో చేరాలని మాన లక్ష్యంగా పెట్టుకుంది. చాలామంది విద్యార్థులు తమ కెరీర్ గురించి ఆలోచించడం కూడా మొదలుపెట్టని వయసులోనే, మాన జంపాల ఖండంతరాల వ్యాప్తంగా బిజినెస్‌లకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ తయారు చేస్తూ, రాబోయే తరం ఏఐ విప్లవాన్ని ఎంత వేగంగా అందుకోబోతుందో ప్రపంచానికి చాటిచెప్పింది.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..