గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు సబ్సిడీ కింద వ్యవసాయ యంత్రాలు అందజేశారు. 33మంది రైతులకు 80శాతం సబ్సిడీపై రూ.12లక్షల విలువైన గల వ్యవసాయ పరికరాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు కులం ఉండదు... పార్టీ ఉండదు... రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలిపారు. రైతులు పంటలు అమ్మకోవటానికి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా హాయ్ అని పెడితే అన్ని మీదగ్గరకే వస్తాయని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ద్వారా…
పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు ఆందోళన వద్దని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకు ప్రభుత్వం మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డ్ ల నుంచి పొగాకు కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులు నల్లబెల్లి పొగాకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు.
రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Agriculture Support Price Poster Released By AP Minister Kakani: వ్యవసాయ మద్దతు ధరల పోస్టర్‌ను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సహా పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం.. సీజన్‌కు ముందే గిట్టుబాటు ధరను ప్రకటిస్తున్నామని మంత్రి కాకాణి తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా రూప కల్పన…