పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందిస్తుంటే చంద్రబాబుకు కనిపించటం లేదని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఏదో విధంగా ఎస్సీలను మోసం చేయాలనే దుష్ట ఆలోచన చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా జనం వెంటే ఉన్నారని మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వర రావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్లకు మాత్రమే మంచి చేసుకునేవారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.
సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. సామాజిక యాత్రకు ఎన్నికలతో సంబంధం లేదు.. సామాజిక విప్లవానికి ప్రతీక ఈ యాత్ర అని ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మున్సిపల్ శాఖ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. మార్కాపురంలో మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంలో ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును వేయాల్సిన పేరుని తప్పుగా ముద్రించారు మునిసిపల్ అధికారులు. ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును మేరుగ నాగార్జునరెడ్డిగా తయారు చేయించారు అధికారులు. వెంటనే గుర్తించి…