చెంగిచెర్ల చౌరస్తాలో విద్యార్ధులతో కలిసి చిందులేస్తూ మంత్రి మల్లారెడ్డి సందడి చేశారు. విజేతలకు ఇచ్చే ట్రోఫీ పట్టుకుని డ్యాన్సులేశారు. అలాగే విద్యార్ధులు స్టేజీపై డ్యాన్సులు వేస్తుండగా.. వారిని మరింత ఉత్సాహపరిచే ప్రయత్నం ఆయన చేశారు. అనంతరం అక్కడకు వచ్చిన మహిళా కళాకారులతో కలిసి బతుకమ్మ పాటలకు మల్లారెడ్డి ఆడిపాడారు.