KTR: బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆరే.. కాంగ్రెస్, బీజేపీ వారి అభ్యర్థి చెప్పగలరా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ చిట్ చాట్ లో అన్నారు. కాంగ్రెస్, బీజేపి పార్టీల సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. తాజాగా కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారని.. పొన్నాల బీఆర్‌ఎస్‌లోకి వస్తానని అంటే వారి ఇంటికి వెళతానని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు, రాసింది చదివే రీడర్ మాత్రమేనని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటదని.. ఆ పార్టీ 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Read Also: Sree leela: అందుకే డాక్టర్ అవ్వాలని ఫిక్సయ్యా.. ఎన్ని కష్టాలు వచ్చినా డాక్టర్ శ్రీలీల అనిపించుకుంటా!
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
మరోవైపు పెండింగ్ అభ్యర్థుల 5 స్థానాలను మూడు నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన తమ అభ్యర్థులు ప్రజల్లో ఉన్నారని.. ప్రచారంలో దూసుకుపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 40 చోట్ల అభ్యర్థులు లేరని.. కానీ 70 స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని పేర్కొన్నారు. అది చూసి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. గ్రేటర్ లో 20 స్థానాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరని అన్నారు. మరోవైపు ఈరోజు కర్ణాటకలో రూ.42 కోట్లు దొరికాయని.. తమకు ఉన్న సమాచారం ప్రకారం 8 కోట్లు కొడంగల్ లో రేవంత్ రెడ్డికి అందాయని ఆరోపించారు. నోట్ల కట్టలతో తెలంగాణ ప్రజలను అంగట్లో సరుకుల కొనాలని కాంగ్రెస్ అనుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read Also: Winter Season : చలికాలంలో పండించే కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
బీఆర్ఎస్ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. మైనార్టీలు తమ వైపే ఉన్నారని.. మైనార్టీల కోసం తాము 9 ఏళ్లుగా పని చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 286 మైనార్టీ హాస్టల్ లు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో బుల్డోజర్ కూల్చివేతలు లేవని… మిషనరీల పై దాడులు లేవని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ మోడీ, షాలను దేశంలో ఏ నేతను కూడా కేసీఆర్ విమర్శించలేదన్నారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభల శక్తిగా ఎదగాలని తమ ఆలోచనని.. బీజేపీ, కాంగ్రెస్ తో తమకెందుకని అన్నారు.
Read Also: Lifestyle : మీకు విపరీతంగా కోపం వస్తుందా? అయితే ఈ టిప్స్ ను తప్పక పాటించాల్సిందే..
తమ పైనే ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని… కాంగ్రెస్ నేతల మీద ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు?. ఓటుకు నోటు కేసును కేంద్ర సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఈసీ బదిలీలను, బదిలీలుగా మాత్రమే చూస్తామన్నారు. మరోవైపు తమకు 85 కంటే సీట్లు తగ్గవని అనుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. 2018 మేనిఫేస్టోలోని 95 శాతం హామీలు అమలు చేశామని.. కరోనా వల్ల నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయామన్నారు. హుజూరాబాద్ లో బీఆర్ఎస్ గెలుస్తుందని… గజ్వేల్ లో ఈటల పోటీ చేసే హక్కు ఉందని తెలిపారు.
- Tags
- ANNOUNCE
- BRS
- ktr
- MLA candidates
- soon
తాజావార్తలు
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?