అతిపెద్ద డైరీ మన రాష్ట్రంలో స్థాపించుకున్నామని, వ్యవసాయంలో భాగమే పాడి అభివృద్ధి చేయడమన్నారు మంత్రి కేటీఆర్. గతంలో ప్రభుత్వ డైరీ కి ప్రోత్సాహం ఇవ్వలేదని, 4 రూపాయలు ఇంసెంటివ్ ఇచ్చామన్నారు కేటీఆర్. పాడి రైతులకు 350 కోట్ల రూపాయలు కేటాయించామని, 2014 లో రైతు ఆదాయం డబుల్ చేస్తామని నరేంద్రమోదీ చెప్పారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రైతులను అదుకున్నాము, కానీ మోడి వల్ల కాలేదని, సముద్రం లేకున్నా చేపల పెంపకం లో ముందు ఉన్నామన్నారు. నాలుగు లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతుంది.. త్వరలో క్షీర విప్లవం రాబోతుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Azharuddin: హెచ్‌సీఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌కి చుక్కెదురు.. ఓటరు జాబితా నుంచి పేరు తొలగింపు..
‘మతం పేరుతో రాజకీయం చేసే చిల్లర పార్టీ కాదు మాది.. కులం పేరుతో విభజించే చిల్లర పార్టీ కాదు బీఆర్ఎస్ అని కేటీఆర్ తేల్చిచెప్పారు. అందర్నీ కలుపుకొని పోయి నడిచే పార్టీ. గరీబోడు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా ఆయనను ఆదుకోవాలన్నదే మా దృక్పథం తప్ప.. ఇంకో ఆలోచన లేనే లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయానికి వస్తే.. దేవుడితోనైనా కొట్లాడటానికి వెనుకాడని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించుకున్న రోజు కృష్ణమ్మ పొంగుకుంటూ వస్తే మనందరి గుండెలు ఉప్పొంగిన మాట వాస్తవం కాదా..? 70 ఏండ్ల తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నీళ్ల గోస తీర్చబోతున్నారు కేసీఆర్. కాంగ్రెస్ ఎందుకు ఆలోచన చేయలేదు.. కృస్ణా జలాలు తీసుకురావాలని. కాంగ్రెసోళ్లకు బీజేపోళ్లకు హైకమాండ్.. ఢిల్లీలో ఉంటది. టికెట్ల పంచాయితీ, పైసల వసూళ్ల పంచాయితీ అంతా ఢిల్లీలోనే. మొనగాడు లాంటి కేసీఆర్‌ను ఇక్కడ పెట్టుకుని, ఈ అడ్డమైన వెధవలు మనకు అవసరమా..? సీట్లు, ఓట్లు అమ్ముకునే కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవసరమా..? కాంగ్రెస్, బీజేపీని ఢిల్లీకి తన్ని తరిమేయాలి.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Shriya Saran : లాంగ్ బ్లాక్ డ్రెస్ లో హొయలు పోతున్న శ్రీయ.. ఇలా చూపిస్తే ఎలా పాప..