తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఒకప్పుడు ఇండియా ఇస్ ఇందిరా, ఇందిరా ఇస్ ఇండియా అని ఉండేనని అన్నారు. మొన్నటికి మొన్న కరెన్సీ నోట్ల మీద కూడా గాంధీ బొమ్మ తీసేసి పీఎం ఫోటో పెడుతారు అని అన్నారని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణకు వచ్చి హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేషన్ షాప్ కి వెళ్లారు.. అక్కడ గల్లీ బీజేపీ లీడర్ లా ప్రవర్తించారని ఆయన వ్యాఖ్యానించారు. రేషన్ షాప్ లో మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు అని అడుగుతారు. ఇండివిజువల్ ఎక్స్ పోసర్ ఎందుకు మాట్లాడుతారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. ఏ పనులు ఏ రాష్ట్రంలో చేయాలనేది రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయి. ఆ అవకాశం రాష్టాలకే ఇవ్వాలి. ఉపాధి హామీ పనులు ఒక్కో రాష్ట్ర అవసరాలు ఒక్కోలా ఉంటాయి. అలా చేసుకుంటూ ముందుకు పోతాం.
సౌత్ ఇండియా నుండి 35 శాతం జీడీపీ ఇస్తున్నాం. వాళ్లేమో మేం ఇస్తున్నాం మీరు తీసుకునే వాళ్ళం అనే అటిట్యూట్ చుపెట్టండం ఎంత వరకు కరెక్ట్. అలాంటి వాటిని ఎంత మాత్రం అంగీకరించం. రాష్ట్రానికి వస్తే థాంక్స్ చెప్పి పోండి అంతే కానీ మేం ఇచ్చినం మీరు అడుక్కోవాలి అనే ధోరణి సహించం. యూస్ లో ఉన్న ఫెడరల్ సిస్టమ్ రావాలి. ఇక్కడ కేంద్రం దగ్గరకు వెళ్లి ప్లీజ్ అని అడుక్కోవాలి. కేంద్రం… రాష్ట్రలతో ఎన్నిసార్లు కూర్చుని మాట్లాడింది. టీం ఇండియా స్ఫూర్తి ఏది?. జీడీపీ అంటే గుజరాత్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అని అంటున్నారు అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.