Minister KTR : బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ బానిస పార్టీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రగతి భవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీ బానిస పార్టీలు జాతీయ పార్టీలు అని ఆయనఅన్నారు. ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలా, తెలంగాణ బిడ్డ కావాలా తెలుసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. కేవీపీ రామచంద్రరావు, షర్మిలలు, తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారన్నారు. తెలంగాణ ఈరోజు వారు కాంగ్రెస్ ని గెలిపిస్తారంట అని, తెలంగాణను వ్యతిరేకించిన కెవిపి, షర్మిలలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి తేస్తాం అంటున్నారు. ఇంతటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టిందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజల పైన రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డి.. వీరు తెలంగాణ కోసం ముసుగులో వచ్చారని, తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి…కేవీపీ రామచందర్రావు… షర్మిల వంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారు… బహురూపుల వేషాల్లోలో తెలంగాణ పైకి వస్తున్నారు. వీరందరితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు మంత్రి కేటీఆర్.
అంతేకాకుండా.. ‘పదేళ్లు సాధించిన అభివృద్ధిని, తెలంగాణ వ్యతిరేకుల చేతులు పెడదామా ప్రజలు తెలుసుకోవాలి. పైకి కనబడేది కిషన్ రెడ్డి అదించేది కిరణ్ కుమార్ రెడ్డి, కనబడేది రేవంత్ రెడ్డి ఆడించేది కేవీపీ రామచంద్రరావు. తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన కేవీపీ రామచంద్రరావు ఈరోజు తెలంగాణ వాదిగా చెప్పుకోవడం మా కర్మ. రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరైన తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా… ఒక్కరన్న రాజీనామా చేశారు… కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయి అని తెలంగాణ ప్రజలు బెదిరించి, మెడలు వంచితే తెలంగాణ ఇచ్చింది సోనియా ఇచ్చింది అంటే అన్యాయంగా ఉంటుంది. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వారు అని బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది అంటే అంత దరిద్రంగా ఉంటుంది. నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా లేదా జీవితాన్ని వెలుగులు నింపిన భారత రాష్ట్ర సమితి సర్కారు కావాలా. ఇంత భావ దారిద్య్రం, లేకితనం కలిగిన ప్రతిపక్షాలతో పోటీ పడాల్సి రావడమే ఈ రాష్ట్రం దురదృష్టం. తెలంగాణకు మోడీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్ అడగదు బీజేపీ అడగదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎక్కడన్నా 4000 రూపాయల పెన్షన్ ఇస్తుందా చెప్పాలి.
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
55 సంవత్సరాలలో 200 దాటి పెన్షన్ ఇవ్వని వారు…. నాలుగు వేలు ఇష్టం అంటే ఎట్లా నమ్ముతారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ వచ్చి చెప్పిన, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పాత చరిత్ర తెలుసు. పాలమూరు ప్రాజెక్టు పైన కేసులు వేసి అడ్డంకులు సృష్టించిన పార్టీలు ఈరోజు ప్రాజెక్టు ప్రారంభాన్ని ప్రశ్నిస్తున్నాయి. 1963 లో నెహ్రూ శంకుస్థాపన చేసిన ఎస్ఆర్ ఎస్పీ కాలువను నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించలేదా. మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలోని 13,14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఈ ప్రాజెక్టును స్వాగతించాలి. ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించే ధైర్యం లేని పార్టీలు ఈరోజు మాపైన ఎన్నికల్లో పోటీ అంటున్నాయి. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రయత్నంలో భాగంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిమ్మిక్, ఉద్యమంలో భయపడి రాజీనామా చేయకుండా పారిపోయిన వాడు కిషన్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితాఆని కలలు కంటే ఎవరు పట్టించుకుంటారు. దేశంలో మోడీని మా పార్టీ విమర్శించినంతగా ఏ ఇతర పార్టీ అయినా విమర్శ చేసిందా.
కాంగ్రెస్ పార్టీ బిజెపి అవగాహనలో ఉన్నాయి. అందుకే బీజేపీని, కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించరు… మా నాయకుల పైన దాడులు చేసిన ఈ డి దాడులు చేసినవి…ఒక్క కాంగ్రెస్ నాయకుడి పైన కూడా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేసినాయా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల పైన మాట్లాడడానికి ఏం లేదు.
పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పైన మాకు ఏలాంటి సంబంధం లేదు. అది వారి తలనొప్పి… మాకు సంబంధం లేదు…’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
తాజావార్తలు
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!