మంచి వర్షాలు పడ్డాయి. తెలంగాణలో చాలాచోట్ల పంటలు పాడైనా.. కొన్ని చోట్ల రైతులు నాట్లు వేసే పనిలో పడ్డారు. ఆయన మంత్రి.. అయినా ఆయనకు నాట్లు వేయడం అంటే సరదా.. దానిని తీర్చుకున్నారు. ఇంతకీ ఎవరా అని మీరు అనుకుంటున్నారు. ఆయనే రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. తెల్లబట్టలు వేసుకొని మరీ పొలం పనులు చేస్తున్న మంత్రిగారిని చూసి అంతా అవాక్కయ్యారు. ఆయన ప్యాంటు పైకి పెట్టి తలకు పాగా చుట్టి సందడి చేయడంతో రైతులు కూడా ఉత్సాహంగా ముందుకు నడిచారు.
Telangana Congress Politics : తెలంగాణ కాంగ్రెస్ లో హీటెక్కిన రాజకీయాలు..ఒకరిపై ఒకరు కుట్రలు
పొలంలో జంబు కొట్టి నారు పర్చి నాట్లు వేశారు మంత్రి ఈశ్వర్. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బొంకూర్ గ్రామంలో రైతులతో మాటమంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గ్రామ శివారులోని రైతుల పొలాల వద్దకు వెళ్ళారు. వారితో మాటా మాటా కలిపారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రైతులతో కలసి పొలంలో ఎడ్లతో జంబు కొట్టి, నారు పరచి నాట్లు వేశారు. అనంతరం రైతులతో కల్సి భోజనం చేశారు. రైతుల బాగోగుల్ని ఆరా తీశారు. స్వయంగా మంత్రి వచ్చి తమతో కలిసి పనిచేయడం, భోజనం చేయడంపై ఆరైతుల ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. రైతులకు అందుతున్న రైతు బంధు గురించి మంత్రి ఆరాతీశారు.పొలంలో కేసీఆర్ అని నాట్లతో డిజైన్ వేశారు రైతులు. ఈ డిజైన్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Business Headlines: అద్భుతంగా రాణించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్