టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం.. టీడీపీలో పని చేసిన పాల్వాయి రజినినీ ఎలా నియమించారు.. ఆంధ్ర వ్యక్తి నియమించారని మాట్లాడటం చూస్తుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఏం చేశారు.. పదేండ్లు పాలన చేసిన వాళ్లు రెండు నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటు.. ఆంధ్ర వాళ్ళను కాంట్రక్టులను పెంచి పోషించినది కేసీఆరే అని ఆమె విమర్శించారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే, మీరు డీజీపీగా ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే తప్పుపడుతున్నారు.. టీఆర్ఎస్ దళారులు సింగరేణిలో ఉద్యోగాలు పొందారు అంటూ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Pet Insurance : మీ కుక్క తప్పిపోయిందా.. మరి ఇన్సూరెన్స్ చేయించారా.. అయితే డబ్బులొస్తాయి
నిరుద్యోగులకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా.. లేక ఒకే రూమ్ లో కావాల్సిన వాళ్లకు పరీక్షా రాయించారా అని ప్రశ్నించారు. మీ హయాంలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు.. మేము ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.. సింగరేణి నిధులు, ఉద్యోగాలు ఎవరు తన్నుకుపోయారో అందరికి తెలుసు అంటూ మండిపడింది. సింగరేణిలో డిప్యూటేషన్, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత దండుకున్నావ్.. లెక్కలు తీయాలా.. కవిత ఒక్కసారి మాట్లాడే ముందు వెనుక ముందు చూసుకో.. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలు.. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదు.. మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తాం.. పేపర్ లీక్ పై మళ్లీ ఎంక్వైరీ జరుగుతుంది అని మంత్రి కొండా సురేఖ వెల్లడించింది.