PM Modi Vizag Tour: ఈ నెల 8న ఏపీకి ప్రధాని మోడీ.. మంత్రుల కమిటీ ఏర్పాటు
- మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రధాని మోడీ..
- ఈ నెల 8వ తేదీన విశాఖ పర్యటనకు ప్రధాని..
- విశాఖలో రోడ్ షో నిర్వహించనున్న ప్రధాని మోడీ..
- మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Vizag Tour: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు.. ఈ నెల విశాఖ పర్యటన ఖరారైనట్టు జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సమాచారం అందించారు.. 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు మోడీ.. అయితే, ఈ నెల 8 తేదీన ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రుల కమిటీని నియమించారు సీఎం చంద్రబాబు నాయుడు.. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. ఈ విషయాన్ని వెల్లడించారు.. విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు.. ఎన్టీపీసీ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.. రూ.65,370 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఎన్టీపీసీ పెడుతోంది.. 2500 ఎకరాల్లో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ జోన్ కు కూడా ప్రధాని ప్రారంభిస్తారు.. నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్క్ కు కూడా పీఎం మోడీ శంకుస్థాపన చేస్తారు.. బల్క్ డ్రగ్ పార్కులో రూ.11,542 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు పార్థసారథి..
Read Also: West Bengal: మమతా బెనర్జీ సన్నిహితుడి హత్య..
Also Read
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
ఇక, జనవరి 8 తేదీన ప్రధాని మోడీ విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభ నుంచే ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు మంత్రి పార్థసారథి.. అంతకుముందు విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహిస్తారు.. నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకూ రోడ్ షో ఉంటుందని తెలిపారు.. మరోవైపు.. వచ్చే విద్య సంవత్సరం లోగా తల్లికి వందనం పథకం అందించేందుకు కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది.. రైతులకు ఇచ్చే ఆర్ధిక సాయం అన్నదాతా సుఖీభవ కార్యక్రమాన్ని కేంద్రంతో పాటే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. కేంద్ర సాయంతో కలిపి రూ.20 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం.. వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్ధిక సాయం రూ.20 వేలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారని వెల్లడించారు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి..
తాజావార్తలు
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!