Minister Atchannaidu: ఒక్క పింఛన్ కూడా తీయం.. ప్రతి ఒక్కరికి అందిస్తాం..
- శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం వాండ్రాడ గ్రామంలో మంద్రి అచ్చెన్నాయుడు పర్యటన..
- లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రూ. 7 వేలు పింఛన్ సొమ్ము అందజేత..
- పెన్షన్ల కోసమే ఏడాదికి 36000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం..
- ఒక్క పింఛన్ కూడా తీయకుండా.. ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: ఒక్క పింఛన్ కూడా తీయకుండా.. ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం వాండ్రాడ గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రూ. 7 వేలు పింఛన్ సొమ్మును అందజేశారు మంత్రి.. పెరిగిన పింఛన్ రూ. 4 వేలు, మూడు నెలల బకాయిలు 3వేలు మొత్తం ఒకేసారి రూ. 7వేలు అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పెన్షన్ల కోసమే ఏడాదికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అని వివరించారు..
Read Also: New Criminal Laws: నేటినుంచి అమల్లోకి కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి ఎఫ్ఐఆర్ నమోదు
Also Read
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ వారికి పెన్షన్ తీసేశారు.. సానుభూతిపరులకు వేధించారని మండిపడ్డారు.. అయితే, మా ప్రభుత్వంలో అలాంటి వాటికి తావులేదు.. ఒక్క పింఛన్ కూడా తీయకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తాం అన్నారు.. మరోవైపు.. వాలంటీర్ వ్యవస్థతతో సంబంధంలేకుండా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం.. వాలంటీర్స్ కంటే ఒక గంట ముందే పింఛను పంపిణీ శామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది.. మంగళగిరి నియోజకవర్గంలో.. ఉదయమే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు.. ఇక, ఎక్కడికక్కడ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!