Karumuri Nageswara Rao: పవన్ కల్యాణ్ పై మంత్రి కారుమూరి నాగేశ్వర్రావు ఫైర్ అయ్యారు. తణుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తే వెయ్యి కోట్లు ఎలా వస్తాయని కారుమూరి అన్నారు. వెయ్యికోట్లు సంపాదిస్తే 21 కోట్లు మాత్రమే ఎందుకు ట్యాక్స్ కడుతున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ని పవన్ కల్యాణ్ చదువుతున్నారని ఆయన అన్నారు. TDR బాండ్ల లో 309 కోట్లు అవినీతి అంటున్నారు.. ఈ స్కాం లో ఏ పార్టీ వాళ్ళు వున్నారు అనేది చూడాలని సూచించారు.. TDR బాండ్లు టిడిపి టైంలో ఎక్కువ జరిగాయి.. టిడిపి హయాంలో TDR బాండ్లు టిడిపి టైంలోనే ఇచ్చారన్న ఆయన.. తణుకులో డంపింగ్ యార్డు లేదని అబద్ధాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. 8 ఏకరల్లో డంపింగ్ యార్డ్ ఉంది.. దీనిపై పశ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు.
Read Also: Razakar: మాజీ గవర్నర్, ఎంపీల చేతుల మీదుగా రజాకర్ మూవీ పోస్టర్ లాంచ్
సీఎం జగన్ వచ్చాక ఆలయాల ప్రతిష్ట పెరిగిందన్నారు మంత్రి కారుమూరి.. టిడిపి హయాంలో సన్నిధి గోల్లలని తీసేస్తే వారిని కొనసాగిస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందన్న ఆయన.. సీఎం జగన్ ఎప్పుడు దేవుడు తోడు ఉన్నారని చెప్తారు. మీ లాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా ఆయన్ని ఎం చేయలేరన్నారు.. చంద్రబాబు మూడు వందల ఆలయాలు కుల్చేతే ఎందుకు మాట్లాడలేదు.. పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఎందుకు ప్రశ్నించలేదు? అని నిలదీశారు.. అసలు పవన్ పార్టీ సిద్దాంతం ఏంటి..? పార్టీ అజెండా ఏంటి.? అని ప్రశ్నించిన ఆయన.. ఒక భార్య ఉంటే భార్యామణి అంటారు.. ఎంత మంది ఉంటే అంత మందిని అలా అనరని పేర్కొన్నారు. బీసీ ఎమ్మెల్యేలను మీరు కొట్టేస్తారు.. అని ఫైర్ అయ్యారు. ఏర్రిపప్ప అని టిడిపి నేతను, చంద్రబాబును అన్నాను.. దాన్ని కూడా మీరు తీసుకున్నారంటే మీరెంత ఎర్రి పప్ప అనేది అర్దం అవుతుందని సెటైర్లు వేశారు. చంద్రబాబు మాత్రమే మీకు గొప్ప.. చంద్రబాబు దోచేసిన దాని గురించి ఎందుకు మాట్లాడరు.. మీరు ప్యాకేజీ స్టార్ కాబట్టి మీకు వాట వచ్చి ఉంటుందని ఆరోపించారు.. కాపు కుర్రాళ్ళని రెచ్చ గొడుతున్నారు.. కాపులే నన్ను రాజకీయాల్లో తీసుకు వచ్చారని.. మీరు పడిన కష్టాల కంటే మేం ఎక్కువ కష్టాలు చూశామన్నారు మంత్రి కారుపూరి నాగేశ్వరరావు.