పార్టీ మారాలనే నిర్ణయం కోటంరెడ్డి వ్యక్తిగతం.. వైసీపీపై బురద జల్లడం కోటంరెడ్డి మానుకోవాలన్నారు మంత్రి కాకాణి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్ని రోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.. ఆడియో రికార్డు అని కోటంరెడ్డికి తెలుసన్నారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి. ఫోన్ రికార్డింగ్ అని తెలుసు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ అని డ్రామాలు చేస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు మ్యాన్ ట్యాపింగ్ జరిగింది.. కోటంరెడ్డి ఈ స్థాయికి రావడానికి కారణం జగన్ కారణం కాదా?. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పావు ఏమైందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం…ముఖ్యమంత్రి .జగన్ మీద రూరల్ ఎం.ఎల్.ఏ.శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. అది ఆయన వ్యక్తిగతం. ఏదో ఒక కారణం చెప్పి బయటకు వెళ్లాలనుకున్నారు. 2014 లో నెల్లూరు రూరల్ టికెట్ పై చాలా ఒత్తిళ్లు వచ్చాయి. అక్కడ జగన్ ఉన్నారు కాబట్టే టికెట్ వచ్చింది. నమ్మకం లేని చోట ఉండలేనని అంటున్నారు. ట్యాపింగ్ కాదు..రికార్డింగ్ అది శ్రీధర్ రెడ్డికి తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కాదు..మ్యాన్ ట్యాపింగ్ జరిగింది..చంద్రబాబు మ్యాన్ ట్యాపింగ్ చేశారు. అందుకే టిడిపి వాళ్ళు ట్యాపింగ్..ట్యాపింగ్ అంటున్నారు.
Read Also: Pawan Kalyan: మూడో విడత సభ్యత్వ నమోదు…క్యాడర్ కు పవన్ రిక్వెస్ట్
నేను ట్యాపింగ్ పై ఆధారాలు అడిగా. అందుకే ఆడియో లీక్ చేయించారు. ట్యాపింగ్ జరగలేదు కాబట్టే శ్రీధర్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. కేసు పెట్టలేదన్నారు. నిన్ను పావుగా వాడుకుని చంద్రబాబు ఆడిస్తున్నారు. జగన్ కు వీర విధేయుడినని చెప్పావు. ఇప్పుడు ఇంకొకరికి విధేయుడిగా మారావ్ అని మండిపడ్డారు మంత్రి కాకాణి. టిడిపి వారికి ఒక అస్త్రం ఇచ్చేందుకే నువ్వు మాట్లాడావ్. ఆవేదన కాదు..ఆలోచన అవసరం. శ్రీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆత్మహత్య లాంటిది. చంద్రబాబు చెప్పినట్లు శ్రీధర్ మాట్లాడుతున్నారు. లోకేష్ పాదయాత్ర విఫలం కావడంతో ప్రభుత్వం మీద బురద చల్లేందుకు శ్రీధర్ లాంటి వాళ్ళను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఇసుక…మద్యం అక్రమాల గురించి మాట్లాడుతున్నారు.
నెల్లూరు రూరల్ లో జఠిగిన అక్రమాలపై కూడా విచారణ చేయిస్తాం అన్నారు. ఏదో ఒక ఆడియో విడుదలైతే సజ్జలను విమర్శించడం సరికాదు. రూరల్ నియోజకవర్గంలో పరిస్థితులు మారాయి. అందుకే చాలామంది శ్రీధర్ దగ్గర నుంచి బయటకు వస్తున్నారు. పార్టీ ముఖ్యమని భావించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎన్ కౌంటర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. శ్రీధర్ భుజంపై గన్ పెట్టి కాల్చాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ట్యాపింగ్ జరగలేదు..ఇప్పటికైనా శ్రీధర్ ఆలోచించాలి. శ్రీధర్ కు జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారన్నారు.
Read Also: Pawan Kalyan: మూడో విడత సభ్యత్వ నమోదు…క్యాడర్ కు పవన్ రిక్వెస్ట్