Minister Kakani Fires on Tdp Leaders: ఏపీలో వైసీపీ, టీడీపీ రాజకీయాలు వేడెక్కాయి. వివిధ అంశాలపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు, ఎల్లోమీడియా కథనాలపై మండిపడ్డారు. వ్యవసాయం గురించి పచ్చ మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. అవగాహన లేకుండా తెలుగు దేశం.పార్టీ.కి ప్రయోజనం కలిగించేందుకు రాసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో రైతులు కరవుతో విలవిల లాడారు. రైతులకు ఉన్న సాగునీరు కూడా అందించలేక పోయారన్నారు మంత్రి కాకాణి.
Read Also:Priyanka Chopra: ప్రియాంక చోప్రా కూతురిని చూసారా? కనిపించడం ఫస్ట్ టైమ్
చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు 70 శాతం కరవు మండలాలే. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మండలాన్ని కూడా ప్రకటించ లేదు. పశువులకు ఆహారం. నీళ్లు లేక రైతులు అమ్ముకున్నారు. జగన్ హయాంలో జలాశయాలు పూర్తి గా నిండుతున్నాయి.. వర్షాలు కురవడంతో రైతులు సమృద్దిగా పంటలు పండించుకుంటున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు.పూర్తి రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు.కోటయ్య కమిటీ పేరుతో కోతలు పెట్టారు. చంద్రబాబు చేసిన మోసాలు ఎల్లో మీడియా ఎందుకు ప్రస్తావించడం లేదు.
నిత్యం ఏదో ఒక బురద చల్లాలనే లక్ష్యం తోనే దుష్ప్రచారం చేస్తున్నారు. బడ్జెట్ గురించి ఆ పత్రికకు అవగాహన లేనట్లు అర్థమవుతోంది. ప్రజల్లో విషం చిమ్మేలా వార్తలు రాస్తున్నారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తున్నాము. రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నాం. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు మంత్రి కాకాణి.
Read Also: Union Budget : నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. పార్లమెంట్లో ప్రసంగించనున్న రాష్ట్రపతి