NTV Telugu Site icon

Jogi Ramesh: ఆ లేఖను చదివితే పవన్‌ వెంటనే ఏపీ వదిలి పారిపోతారు..!

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది.. వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంతవరకు న్యాయమని పవన్‌ను లేఖలో నిలదీసిన ముద్రగడ.. పవన్‌ మాట్లాడే భాష వల్ల నష్టం తప్ప లాభం లేదన్నారు. ఇప్పటివరకు ఎంతమందిని చెప్పుతో కొట్టారో.. గుండ్లు గీయించారో చెప్పాలని ప్రశ్నించారు. అయితే, ఈ వ్యవహారంపై హాట్‌ కామెంట్లు చేశారు మంత్రి జోగు రమేష్.. ముద్రగడ లేఖను పవన్‌ కల్యాణ్‌ చదివితే వెంటనే ఏపీ నుంచి పారిపోతారని పేర్కొన్నారు.. ముద్రగడ విలువలు ఉన్న వారు గనుక విలువల గల లేఖ రాశారని చెప్పుకొచ్చారు.. పవన్ కల్యాణ్‌కి సినిమాలు, కాల్ షీట్లు లేవు.. అందుకే ఇక్కడ చంద్రబాబు డైరెక్షన్‌లో యాక్షన్‌ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.. దీనికి కో డైరెక్టర్ నాదెండ్ల మనోహర్ అని సెటైర్లు వేశారు.

Read Also: New Party in AP: ఏపీలో కొత్త పార్టీ.. లిరిసిస్ట్ జొన్నవిత్తుల కీలక ప్రకటన

పవన్‌ కల్యాణ్‌ సీఎం.. సీఎం అని గతంలో ఆయన అభిమానులు అరిచారు.. అది అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే అవుతా ఎవరు అవుతారో చూస్తా అంటున్నారు. ఎమ్మెల్యే కావడం కోసం తాపత్రయ పడుతున్నారని దుయ్యబట్టారు. 2014 నుంచి 2019 వరకు ఏ వేషాలు వేశారో ప్రజలకు తెలుసు.. పవన్ బాగా తిరగాలన్నారు. వంగవీటి మోహన్ రంగా పేదల కోసం పోరాటం చేస్తుంటే టీడీపీ గుండాలు ఆయనను పొట్టన పెట్టుకున్నారు.. రంగా హత్య కు చంద్రబాబు కారణం అని హరి రామయ్య జోగయ్య పుస్తకాలు రాశారు. ముద్రగడ కుటుంబ సభ్యులను కొట్టుకుంటు చంద్రబాబు హయాంలో లాక్కెళ్లారు. అలాంటి చంద్రబాబుకి ఓటు వేయమని పవన్ చెబుతారా? అని ప్రశ్నించారు. కాపులను గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి వైస్సార్, జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు.

Read Also: Kurasala Kannababu: 90 శాతం కాపుల మద్దతు జగన్‌కే.. ఫ్యాన్స్‌ కోసమే పవన్‌ యాత్ర..!

రేపల్లెలో మృతి చెందిన అమర్నాథ్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి చంద్రబాబు ఊరేగింపుగా, గుంపుగా వెళ్లాడు అని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్‌.. అక్కడకు వెళ్లి చంద్రబాబు ఓట్లు అడుగుతున్నారు. మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి , మాకు జిందాబాద్‌ కొట్టాలని చంద్రబాబు అంటారు అని ఎద్దేవా చేశారు. అమర్నాథ్‌ ను హతమార్చిన ముద్దాయిలను అరెస్ట్ చేశాం. కానీ, చంద్రబాబు శవ రాజకీయం చేస్తున్నారని.. కులాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అమర్నాథ్‌ కుటుంబానికి ఆర్థిక సాయం చేశాం.. ఇంటి స్థలం ఇచ్చాం.. పార్టీలు, కులాల గొడవలతో సంబంధం లేదని అమర్నాథ్ తల్లి చెప్పారని వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం.. నిందితులపై చర్యలు తీసుకుంటామన్న ఆయన.. చంద్రబాబు పరామర్శకు వెళ్లారా? శవాలపై పేలాలు ఎరుకోవడానికి వెళ్లారా? అని నిలదీశారు.

Read Also: Bhatti Vikramarka : కృష్ణా జలాలు రాకుండా అడ్డుపడింది బీఆర్‌ఎస్‌ పార్టీనే

ఇక, ఆడపిల్లల అనురాగం మాకు, మా సీఎంకి తెలుసన్నారు జోగి రమేష్.. ఆడ పిల్లలు లేని వారు చంద్రబాబు, లోకేష్‌ అని.. రిషితేశ్వరి హత్య కేసులో నిందితుల పక్షాన ఉంది చంద్రబాబు, టీడీపీ నేతలు కాదా? అని ప్రశ్నించారు. ఎమ్మార్వో వనజాక్షిని కొట్టుకుంటూ వెళ్లింది మీ ఎమ్మెల్యే చింతమనేని కాదా? అని నిలదీశారు. 2019 ఎన్నికల్లో మహిళలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారు. చంద్రబాబు పొర్లు దండాలు పెట్టిన బీసీలు నమ్మరని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌, చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేయొద్దు.. ప్రతిపక్షాలు చేయడానికి ఏమి లేఖ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, లోకేష్ పాక్కుంటా తిరిగినా, పవన్ కల్యాణ్‌ వారాహి వాహనంలో తిరిగిన ప్రజలు నమ్మరు.. మరోసారి వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్‌.