Jonnavithula Ramalingeswara Rao New Party in Andhrapradesh: ఇప్పటికే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న క్రమంలో ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతుందనే ప్రకటన వచ్చింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం ‘జై తెలుగు’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు టాలీవుడ్ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రకటించారు. అయితే అధికారంలోకి రావడం తమ లక్ష్యం అని కాకుండా రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడమే చెప్పడం ఆసక్తికరంగా మారింది. విజయవాడలో మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. తెలుగు భాషకు పునర్‌వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమని, తెలుగు భాష, పరిరక్షణ అజెండాతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఆయన పేర్కొన్నారు.
Huma Qureshi: కైపెక్కిస్తున్న హుమా ఖురేషీ క్లీవేజ్ ట్రీట్
ఆగస్ట్ 15 నాటికి తమ పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామని ‘జై తెలుగు’ పేరుతో ఐదు రంగులతో జెండా కూడా రూపొందించినట్లు వెల్లడించారు. నీలం,జలం, పచ్చ, వ్యవసాయం, ఎరుపు రంగు.. శ్రమశక్తి, పసుపు.. వైభవానికి, తెలుపు స్వచ్ఛతకు చిహ్నంగా రూపొందిస్తున్నామని జొన్న విత్తుల వెల్లడించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఒకప్పుడు మదరాసీలు అన్నారు, ఇప్పుడు హైదరాబాదీలు అనిపించుకుంటున్నాం కానీ తెలుగు వాళ్లం అని మాత్రం అనిపించులేక పోతున్నామని సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మన తెలుగు భాషను మనమే విస్మరించి చులకన చేసుకుంటున్నామని తెలుగు భాష కోసం ఐదుగురు మహనీయులు కృషి చేశారని ఆయన అన్నారు. అందుకే గిడుగు రామ్మూర్తి నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజి ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఫోటోలు తన జై తెలుగు రాజకీయ జెండాలో, ఎజెండాలో ఉంటాయని అన్నారు.