Minister HarishRao: మర్రిగూడను అభివృద్ధి చేసే బాధ్యత నాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసు అన్నారు మంత్రి హరీష్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మర్రిగూడెం మండలం రాజుపేట తండాలో గ్రామస్థులతో సమావేశమైన మంత్రి హరీష్ రావు. గ్రామస్థులతో కలిసి టిఫిన్ తిన్నారు హరీష్ రావు. ఒక కొబ్బరికాయ కొడితే 100 పనులు జరుగుతాయి అన్న రాజగోపాల్ రెడ్డి 4 సంవత్సరాలలో ఒక కొబ్బరికాయ కూడా కొట్టే సమయం దొరకలేదు…అధికారంలో టిఆర్ఎస్ పార్టీ ఉంది..అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది.

టిఫిన్ తింటూ గ్రామస్తులతో హరీష్ మాటామంతీ
Also Read
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
అన్నీ తెలిసిన కేసీఆర్ సీఎంగా ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక మంత్రిగా నేను ఉన్నాను.. మర్రిగూడను అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నారు హరీష్ రావు. మా తండాలు మాకు కావాలని కోరుకున్నారు మన గిరిజన సోదరులు.. గ్రామ పంచాయితీలు కావాలని కోరుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మాట తప్పారు. కేసీఆర్ తండాలను గ్రామా పంచాయితీలుగా చేయడం వల్ల మొత్తం 3146 మంది సర్పంచులు అయ్యారు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఏం లాభం లేదన్నారు హరీష్ రావు.
Read ALso: Physical Harassment: ప్రైవేట్ స్కూళ్ళో LKG విద్యార్థినికి వేధింపులు.. కీచక డ్రైవర్ అరెస్ట్
మళ్లీ టీఆర్ఎస్ ను తిట్టడం తప్ప ఇంకేమైనా చేస్తాడా? మద్యంతో, డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలను మర్రిగూడ ప్రజలు తిప్పికొట్టాలి. ఎంబీబీఎస్ లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ తెచ్చాం. 6615 ఎంబీబీఎస్ సీట్లలో 661 సీట్లు ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి. విద్యలో,ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్.. గిరిజనులకు మంచి అవకాశాలు కలుగుతాయి. ఎన్నికల్లో గెలిపిస్తే ఏడాది లోపు ఇచ్చిన మాటలన్ని అమలు చేస్తాం. ఇచ్చిన మాట నెరవేర్చే బాధ్యత నాది.
బీజేపీ గెలిస్తే 3000 పెన్షన్ ఇస్తారా? మోడీ సొంత రాష్ట్రం బీజేపీలో 700 పెన్షన్ ఇస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో 600 పెన్షన్ ఇచ్చేవాళ్లు, తెలంగాణలో 3000 ఇస్తారంట. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజుల చేపిస్తా అన్నాడట.. రాజగోపాల్ రెడ్డి అసుంటోడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 3000 పెన్షన్ ఇచ్చి తెలంగాణకి వచ్చి ఈ మాటలు చెప్పండి. భూమికి బరువైన పంట పండుతోంది. తెలంగాణలో గింజ మిగలకుండా కొన్నాం. 1000 ఇళ్లు ప్రభుత్వం ఇచ్చినా.. కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదు.
కాంగ్రెస్ పార్టీ లేకుండానే పోయింది, బీజేపీ మందు సీసాలు, పైసలు ఇచ్చి ఓట్లు కొనాలని చూస్తున్నారు. కనపడని మనిషి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటారా? అభివృద్ధి చేసే టీఆర్ఎస్ ని గెలిపిస్తారా? ఆగం కాకుండా మొదటి డబ్బా మీద 2 నంబర్ బటన్ కారు గుర్తు ప్రభాకర్ రెడ్డి ఫోటో మీద ఓటు వేసి దీవించండి. నా బాధ్యత తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు.
Read Also: JaiRam Ramesh Face to Face Live: రాహుల్ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా
తాజావార్తలు
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!