మంచిర్యాల జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో రూ.140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మంత్రి హరీష్ రావు. హజీపూర్ మండలం పడ్తనపల్లిలో రూ.85 కోట్లతో నిర్మించే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని హరీష్ రావు ప్రారంభించనున్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్‌తో మండలంలోని 10 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. అయితే.. అనంతరం దొనబండ గ్రామంలో నిర్వహించే ప్రగతి నివేదన సభలో మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. అక్కడి నుంచి చెన్నూర్‌కు చేరుకొని రూ.10 కోట్లతో నిర్మించిన 50 పడకల దవాఖానను మంత్రి ప్రారంభించి, మున్సిపల్ నిధులు, టీయూఎఫ్‌ఐడీసీ నిధులు, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి ద్వారా మంజూరైన నిధులతో పలు అభివృద్ధి పనులను అంకురార్పన చేయనున్నారు.
Also Read : RBI: రూ.2000నోట్ల మార్పిడికి నేడే ఆఖరు.. మార్చుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
చెన్నూర్ పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మించే మోడ్రన్ ధోబీఘాట్ పనులు, టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.23 కోట్లతో చేపట్టే పనులకు భూమి పూజ చేస్తారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.20 కోట్లతో చేపట్టే పనులకు టెండర్లు పూర్తి కావచ్చిన దృష్ట్యా, ఆ పనులకు కూడా మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేస్తారు. అనంతరం చెన్నూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో నిర్వహించే రోడ్‌షోలో మంత్రి పాల్గొననున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో మంచిర్యాల జిల్లాకేంద్రంతో పాటు దొనబండలో భారీ ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల, నస్పూర్ పట్టణాల నుంచి సభ నిర్వహించే దొనబండకు భారీ బైక్ ర్యాలీ తీయనున్నారు. బహిరంగ సభకు వేలాది మంది హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. చెన్నూర్ పట్టణంలో నిర్వహించే రోడ్‌షోకు యంత్రాంగం, అధికారులు పటిష్ట భద్రత ఉండేలా చూస్తున్నారు. చెన్నూర్ పట్టణం మొత్తం జెండాలు, భారీ కటౌట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read : Sikkim: సిక్కింలో మూడు జిల్లాలకు అలర్ట్.. షాకో చో సరస్సు ఎప్పుడైనా తెగిపోవచ్చు